CM Jagan: ఢిల్లీకి సీఎం జగన్ - కేంద్ర సంస్థలకు చంద్రబాబు కేసులు..!?

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. చంద్రబాబు అరెస్ట్..ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. అధికారిక అజెండా తో సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పైన కేసులను కేంద్ర విచారణ సంస్థలకు అప్పగించే అంశం పై పైన చర్చ మొదలైంది. దీంతో, ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయనే ఉత్కంఠ మొదలైంది.

సీఎం జగన్ ఢిల్లీ టూర్:ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పైన చర్చ మొదలైంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదం పై నిర్వహించే సమీక్షకు హాజరు కానున్నారు. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలవనున్నారు. ముఖ్యమంత్రి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీకి వెళ్లాలని భావించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు..ఏపీలో అసెంబ్లీ సెషన్స్.. వరుస సెలవులతో వాయిదా పడింది. ఇప్పుడు ఢిల్లీలో సమావేశానికి హాజరు కావటంతో పాటుగా ప్రధానిని కలుస్తారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ ఇటు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన వేళ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది.

Political Curiosity over CM Jagans Delhi Tour Amidst Chandrababus Case

చంద్రబాబు కేసుల వేళ:ప్రధాని మోదీని సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కేసుల వ్యవహారం పైన ఇప్పటికే విచారణ సంస్థలు సేకరించిన సమాచారం కేంద్రానికి ఇచ్చి..ఇందులో ఇప్పటికే ఐటీ , జీఎస్టీ ఇంటలిజెన్స్ విచారణ జరిగి ఉంది. స్కిల్ కేసులో జీఎస్టీ ఇంటలిజెన్స్ ఈడీకి ఫిర్యాదు చేసింది. హవాలా రూపంలో నగదు తరలించారనే ఆభియోగాలు ఉన్నాయి. షెల్ కంపెనీలను నిధులు మళ్లించారనే అభియోగం..ఆ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో ఉండటంతో ఈ వ్యవహారం ఈడీకి బదలాయించే ఆలోచన జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీని పైన అధికారికంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో హోం మంత్రితో ఈ కేసు బదలాయింపు పైన చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

రాజకీయ నిర్ణయాలు:ఇక, కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. పోలవరం కు అడహక్ నిధుల కోసం సీఎం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. పునరావాస ప్యాకేజీ పైన పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నెలలోనే దీనికి సంబంధించి నిర్ణయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక..టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ నేరుగా టీడీపీతో పొత్తు ప్రకటన చేయటం పైన బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఏపీలో బీజేపీ రాజకీయ నిర్ణయం కీలకం కానుంది. ఏపీలో మారుతున్న రాజకీయం..ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అటు ప్రధాని, హోం మంత్రితో సమావేశం కావటం రాకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+