రాజ‌కీయ పద్మవ్యూహం: 2023 మార్చిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 2023 మార్చిలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు స‌న్నాహాలు చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బ్యాగ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభమైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం పేరుతో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మ‌మే దీనికి పునాది అంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా స‌హ‌కారం అందిస్తే మార్చిలో ఎన్నిక‌లు జ‌రిపించేయాల‌నే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్లు స‌మాచారం.

కేంద్రం స‌హ‌క‌రిస్తే తెలంగాణ కూడా

కేంద్రం స‌హ‌క‌రిస్తే తెలంగాణ కూడా

కేంద్రం స‌హ‌క‌రించి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ముంద‌స్తుకు వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేసుకుంటోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ ముంద‌స్తుకు వెళితే తాను కూడా వెళ్లాల‌ని ఏపీ అనుకుంటోంది. ఇప్పుడు మాత్రం ఏపీ ప్ర‌భుత్వం ముంద‌స్తుకు వెళితే తాము కూడా ముంద‌స్తుకు వెళ్లాల‌ని తెలంగాణ భావిస్తోంది.

మేము కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటున్న అమిత్ షా

మేము కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటున్న అమిత్ షా


అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఎన్నిక‌ల‌కు తాము సిద్ధంగా ఉన్న టీఆర్ ఎస్‌కు స‌వాల్ విసిరారు. అంటే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే ఈ రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం కూడా అన్నిర‌కాలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది.

లోపాయికారీగా ఎన్డీయేకు స‌హ‌క‌రిస్తున్న వైసీపీ!

లోపాయికారీగా ఎన్డీయేకు స‌హ‌క‌రిస్తున్న వైసీపీ!


లోక్‌స‌భ‌లోకానీ, రాజ్య‌స‌భ‌లోకానీ త‌న‌కున్న బ‌లంద్వారా లోపాయికారీగా ఎన్డీయే ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తూ వ‌స్తోన్న వైసీపీకి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తివ్వొచ్చ‌ని భావిస్తున్నారు. అలాకాకుండా బీజేపీకి ప్ర‌త్యేకంగా ఏమైనా వ్యూహాలుంటే అనుమ‌తి రాక‌పోవ‌చ్చంటున్నారు.

ఏదేమైనాకానీ భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న రాజ‌కీయ స్వ‌లాభం చూసుకున్న త‌ర్వాతే ఇత‌ర పార్టీల గురించి ఆలోచిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. వారు స్నేహితులైనా, శ‌త్రువులైనా బీజేపీ లెక్క మాత్రం ఒక్క‌టిగానే ఉంటుంది.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+