కూటమికి సర్వే నిపుణుడి షాక్ ? సూపర్ సిక్స్ హామీలపై పల్లెల్లో ఫీడ్ బ్యాక్ ఇదే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉన్న ప్రధాన కారణాల్లో సూపర్ సిక్స్ హామీలు కూడా ఒకటి. అధికారంలోకి రాగానే వీటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు.. ఆ తర్వాత మాత్రం వీటిపై నోరు మెదపడం లేదు. అదిగో ఇదిగో అంటూనే 9 నెలల కాలం గడిపేశాయి. ఈ నేపథ్యంలో గతంలో కూటమి ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందని పలు సర్వేల్లో చెప్పిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు.

సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తన ట్వీట్ లో కూటమి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. రాష్ట్రంలోని జనం సూపర్ సిక్స్ హామీలపై ఏమనుకుంటున్నారో ఆయన ట్వీట్ చేశారు. ఇందులో ఆయన రాష్ట్రంలోని పల్లెల్లో సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైందని తేల్చిచెప్పేశారు. అంతే కాదు చంద్రబాబు ఏఐ చుట్టూ తిరుగుతూ ఏం తప్పు చేస్తున్నారో కూడా చెప్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రవీణ్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

poll surveyor Praveen pullata says distress in rural ap over nda s super6 promises failure

రాష్ట్ర ప్రభుత్వం ఏఐపై ఫోకస్ పెట్టడాన్ని ప్రశ్నిస్తూ.. ఏఐ సంగతేమో కానీ గ్రామాల్లో డబ్బులు రొటేషన్ జరగట్లేదు అంటూ ప్రవీణ్ పుల్లట తన ట్వీట్ లో వెల్లడించారు. తద్వారా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం వల్ల గ్రామాల్లో జనం చేతిలో డబ్బులు లేకుండా పోతున్నాయని, దీని వల్ల అంతిమంగా జనంలో అసంతృప్తి పెరుగుతోందనే అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

poll surveyor Praveen pullata says distress in rural ap over nda s super6 promises failure

Take a Poll

గతంలో కూటమి గెలుపుపై ఎంత కచ్చితంగా సర్వేలు ఇచ్చారో అంతే నిక్కచ్చిగా కూటమి ప్రభుత్వంపైనా ప్రవీణ్ పుల్లట తన అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై ప్రవీణ్ చేసిన ట్వీట్ వాస్తవ పరిస్ధితులకు అద్దం పట్టేలా ఉందన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+