ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం-9 సీట్లలో వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ పోరు..

ఏపీలో మూడు కోటాల్లో 9 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇవాళ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానాలకు, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాలకు, 4 స్దానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఏపీలో పశ్చిమ(కడప-అనంతపురం-కర్నూలు), తూర్పు (ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు) రాయలసీమ, ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానాలతో పాటు పశ్చిమ(కడప-అనంతపురం-కర్నూలు), తూర్పు రాయలసీమ (ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు) టీచర్ ఎమ్మెల్సీ స్ధానాలు, పశ్చిమగోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూల్లో ఒక్కో స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

polling begins for 9 mlc seats in ap including graduate, teachers and local bodies quota

వీటిలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగానే పోరు సాగుతోంది. ఈ సీట్లను ఎలాగైనా గెల్చుకోవాలని పట్టుదలగాఉన్న వైసీపీకి స్ధానిక సంస్ధల కోటాలో జరుగుతున్న నాలుగు సీట్ల ఎన్నికల్లో మాత్రం ఎదురులేదనే చెప్పవచ్చు. కానీ టీచర్లు, గ్రాడ్యుయేట్ కోటాలో జరుగుతున్న ఐదు సీట్ల ఎన్నికల్లో మాత్రం విపక్ష టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే విపక్షాలు వైసీపీకి వ్యతిరేకంగా క్షేత్రస్దాయిలో సహకరించుకుంటూ ఉండటం ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. అటు ప్రభుత్వం కూడా అన్ని అస్త్రాలు వాడుతూ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తోంది.

polling begins for 9 mlc seats in ap including graduate, teachers and local bodies quota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+