Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ- టీడీపీలో కొత్త టెన్షన్ : క్రాస్ ఓటింగ్ - గెలిచేదెవరు..!?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం ఏడు స్థానాలకు 8 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఓటు వేయాల్సి ఉంది. దాదాపు పోలింగ్ ప్రక్రియ పూర్తి కావటంతో..పలితం పైన రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభంలోనూ..ఆ తరువాత రెండు పార్టీల నుంచి మైండ్ గేమ్ సాగింది. అనేక రకాల ప్రచారం తెర మీదకు తీసుకొచ్చారు. సీఎం జగన్ - టీడీపీ చీఫ్ చంద్రబాబు ఓటు వేసారు. ఇక..గెలిచేదెవరు. అంచనాలు మొదలయ్యాయి.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా ఒక్క ఓటు మాత్రమే పోల్ కావాల్సి ఉంది. 174 ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి. వైసీపీకి చెందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటు వేయాల్సి ఉంది. ఈ ఉదయం కుమారుడి వివాహం కారణంగా సాయంత్రం 4 లోగా ఆయన ఓటు వేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా విమానంలో విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో ఓటు వేయయనున్నారు. ముఖ్యమంత్రి జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా రెండు పార్టీలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ఓటు వేసారు. గంటా రాజీనామా ఆమోదం పైన ప్రచారం సాగినా.. ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గంటా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Polling come to an end in MLC Elections, Speculation on Cross voting in parties supporters

ఇక..ఏడు స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఒక్కో అభ్యర్ధి విజయానికి 22 ఓట్లు అవసరం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. టీడీపీ నుంచి నలుగురు, జనసేన ఒక ఎమ్మెల్యే మద్దతుతో 156కి చేరింది. ఆనం..కోటంరెడ్డి తమకు మద్దతుగా ఓటు వేసే అవకాశం లేదని వైసీపీ డిసైడ్ అయింది. దీంతో..వైసీపీ బలం 154గా ఉంది. ఏడుగురు అభ్యర్ధులు గెలవాలంటే కావాల్సిన సంఖయ ఇదే. ఒక్క ఓటు కూడా పొరపాటు జరగకపోతే వైసీపీ 7 గురు అభ్యర్దులు విజయం సాధిస్తారు. అదే సమయంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో నలుగురు వైసీపీకి మద్దతుగా నిలవటంతో ఆ సంఖ్య 19కి చేరింది. వైసీపీ నుంచి ఇద్దరు ఆనం -కోటంరెడ్డి మద్దతుతో 21కి చేరింది. తమ అభ్యర్ధి గెలవాలంటే ఇంకా ఒక ఓటు అవసరం అవుతుంది.

Polling come to an end in MLC Elections, Speculation on Cross voting in parties supporters

పోలింగ్ పూర్తయ్యే వరకూ అనేక రకాల ప్రచారాలు జరిగాయి. పోలింగ్ జరిగే సమయంలోనూ..తారువాత క్రాస్ ఓటింగ్ పైన మైండ్ గేమ్ ప్రారంభించాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేశామని చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వారిలో తిరిగి టీడీపీకి ఓట్లు వేసారంటూ ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేసారు. టీడీపీ నుంచి వైసీపీకి క్రాస్ ఓటింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. సోషల్ మీడియా వేదికగా క్రాస్ ఓటింగ్.. మైండ్ గేమ్ రెండు పార్టీల వైపు కొనసాగింది. ఈ సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో..వైసీపీ ఏడు స్థానాల్లోనూ గెలుస్తుందా.. టీడీపీ పోటి ఫలిస్తుందా..క్రాస్ ఓటింగ్ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+