గంటా రాజీనామా ఆమోదం - అక్కడే అసలు ట్విస్ట్..!?
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ వర్సస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు తారా స్థాయికి చేరాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ వర్సస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు తారా స్థాయికి చేరాయి. ఒక్క ఓటు ఇప్పుడు టీడీపీ - వైసీపీ మధ్య కీలకంగా మారింది. ఎవరు గెలవాన్నా.. ఎవరు ఓడినా ఒక్క ఓటు తేడా మాత్రమే ఉంది. ఈ సమయంలో గంటా రాజీనామా ఆమెదించారనే అంశం తెర మీదకు వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వస్తోంది. గెలుపు పైన రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. అందరి చూపు క్రాస్ ఓటింగ్..రెబల్స్ పైనే ఫోకస్ అయింది. అసెంబ్లీ కేంద్రంగా ఏం జరుగుతోంది...
ఎమ్మెల్య కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే 102 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం జగన్ ఓటు వేసారు. మొత్తం ఏడు స్థానాలకు 8 మంది బరిలో నిలిచారు. ఒక్కో ఎమ్మెల్యే గెలుపుకు 22 ఓట్లు కావాలి. వైసీపీకి ఏడుగురు అభ్యర్ధులకు కావాల్సిన 154 ఓట్ల సంఖ్యా బలం ఉంది. ఒక్క ఎమ్మెల్యే ఓటు తేడా జరిగినా ఫలితం మారిపోతుంది. టీడీపీకి 21 మంది ఓట్ల మద్దతు కనిపిస్తోంది. వైసీపీ నుంచి మరి కొందరి మద్దతు ఉందంటూ ప్రచారం చేస్తోంది. అటు వైసీపీ తమకే టీడీపీ ఓట్లు పోలవుతాయని చెబుతోంది. ఇదే సమయంలో రెండు పార్టీల్లో ఇప్పటికే ఉన్న రెబల్స్ కాకుండా.. ఇంకా క్రాస్ ఓటింగ్ కు ఎవరైనా పాల్పడుతారా అనే చర్చ సాగుతోంది. అదే జరిగిగే మొత్తం ఫలితాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం జగన్..!!#YSJagan #CMJagan #ApMLCElections #OneIndiaTelugu pic.twitter.com/jrZHj2SQ6R
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2023
టీడీపీ నుంచి గెలిచిన వైసీపీకి దగ్గరైన నలుగురు అధికార పార్టీ అభ్యర్దులకే ఓట్లు వేయనున్నారు. వైసీపీ నుంచి గెలిచి..ఇప్పుడు విభేదించిన ఆనం..కోటంరెడ్డి టీడీపీకే ఓటు వేస్తారని వైసీపీ కూడా ఫిక్స్ అయింది. వారిని తమ ఓటర్లుగా చూడటం లేదు. టీడీపీ ఆ ఇద్దరితో కలిసి తమ సంఖ్యా బలం 21గా చెబుతోంది. ఇంకా టీడీపీకి ఒక ఓటు కావాలి. వైసీపీలో సీట్లు దక్కే అవకాశం లేని వారు..పార్టీలో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపైన చంద్రబాబు స్వయంగా సమీక్ష చేస్తున్నారు. విజయం పైన ధీమాగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది. తుది ఫలితం పైన ఆసక్తిని పెంచుతోంది.













Click it and Unblock the Notifications