ఏపీలో పోలింగ్ ఆ పార్టీకే అనుకూలంగా ఉందా..?
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి.చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. తమది అధికారమంటే.. తమదే అధికారమని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ...లోలోపల మాత్రం గెలుస్తామో లేదో అని భయాందోళన చెందుతున్నారు. పోలింగ్ సరళీ చూసిన తర్వాత అధికార పార్టీకి కొంత సానుకూలత కనిపిస్తుంది.
రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి జగన్ సీఎంగా ఉండగా భవిష్యత్తు ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.రూరల్, అర్బన్ ఏరియాలలో పథకాలు గట్టిగానే ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటివరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మినట్టు కనిపిస్తోంది. వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో క్యూలైన్లలో బారులు తీరారు. అందువల్ల రాష్ట్రంలో వైసీపీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

కూటమికి, వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించినా ఎన్నికల సమయానికి పరిస్థితులు అన్నీ మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ప్రధానంగా అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు సైతం వైసీపీకే అనుకూలంగా ఉండబోతున్నాయని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరీ జూన్ 4న వెలువడనున్న ఫలితాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications