ద్రోహుల పనిపట్టాలి: పొంగులేటి, భయపడమన్న రమణ

పోలవరం బోర్డు తెలంగాణకు సభ్యత్వం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం అహంకార పూరితమని పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టడి చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతాలను పరిరక్షించేందుకు ఇతర పార్టీలతో కలిసి టిటిడిపి నేతలు రావాలని కోరారు.
టిఆర్ఎస్‌కు బెదిరేది లేదు: రమణ
తెలంగాణ రాష్ట్ర సమితి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణ అన్నారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఉన్నదంటే ఆ ఘటన టిడిపిదేనని అన్నారు. టిడిపి ఆవిర్భావానికి ముందు హైదరాబాద్ మత కలహాలతో అట్టుడికేదని, టిడిపి హయాంలోనే శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications