దొడ్డిదారి: టిఆర్ఎస్‌పై పొన్నాల, అలా జరగలేదన్న డిఎస్
హైదరాబాద్: దొడ్డిదారిన శాసనమండలి ఛైర్మన్‌ను ఎన్నుకోవాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం గవర్నర్ నర్సింహన్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. మండలి ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని గవర్నర్‌ను కోరినట్లు పొన్నాల తెలిపారు.
అనర్హత పిటిషన్ విచారణకు రాకుండానే ఇలా చేయడం సరికాదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం విలువలకు తిలోదకాలిస్తోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఇతర పార్టీల ఎమ్మెల్సీలను చేర్చుకోవడం అనైతికమని విమర్శించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని మరో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక తర్వాతే మండలి సమావేశాలుండాలన్నారు.
శాసనమండలి ఛైర్మన్ పదవికి పోటీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డిఎస్ చెప్పారు. మండలి ఛైర్మన్‌కు పదవి కోసం ఎప్పుడూ ఎన్నిక జరగలేదని ఆయన అన్నారు. గవర్నర్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవల ఐదుగురు ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications