త్రిష దశ మార్చిన పొన్నియన్ సెల్వన్; స్టార్ హీరోలతో వరుస సినిమాలు!!
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి చిత్రాలలో తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది త్రిష. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో తన విజయ పరంపరను కొనసాగించింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సీనియర్ కథా నాయకురాలిగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.
త్రిష దూకుడు మధ్యలో కాస్త తగ్గినట్టు అనిపించినా, తాజాగా మణిరత్నం సినిమా దెబ్బకు త్రిష స్టార్ మారిపోయింది. వరుస సినిమాలతో త్రిష బిజీ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష మరోమారు మునుపటి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుందవాయ్ పాత్రలో అలరించిన త్రిష, సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో కూడా జోరుగా పాల్గొంది.

అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం అందం తగ్గకుండా, చక్కని కట్టుబొట్టుతో త్రిష అందరిని ఆకట్టుకుంటుంది. మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ దెబ్బతో త్రిష మళ్లీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.
అజిత్ సరసన కూడా కథానాయికగా నటించడానికి త్రిష రెడీ అయింది . కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న గోల్డెన్ జూబ్లీ చిత్రంలోనూ ధనుష్ కి జోడిగా కూడా త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు రామ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ రాబోయే చిత్రంలోనూ త్రిష హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ ఎఫెక్టుతో కోలీవుడ్ లోని స్టార్ హీరోలంతా త్రిష పేరే జపం చేస్తున్నట్టు సమాచారం. మణిరత్నం కమలహాసన్ కాంబో లో రాబోతున్న మూవీ లో కూడా త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ దెబ్బకు త్రిష నక్కతోక తొక్కినట్టు, ఆమెకు అదృష్టం కలిసి వచ్చిందని సినీ వర్గాలు, త్రిష అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications