Posani Krishna Murali: అవి కమ్మ అవార్డులు నంది అవార్డులు కాదు..పోసాని సంచలనం

గతంలో ఇచ్చిన నంది అవార్డుల విధానంపై నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ, జోగినాయుడుతో కలిసి పోసాని పాల్గొన్నారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులను ఇవ్వాలా? వద్దా? అనే సందేహంతో ఉన్నామని, ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

12 మంది న్యాయనిర్ణేతల్లో 11 మంది కమ్మవారే ఉంటే అవి కమ్మ అవార్డులే అవుతాయన్నారు. గ్రూపులు, కులాలవారీగా అవార్డులు పంచుకున్నారని, తాను గాయం, పవిత్ర బంధం, పెళ్లిచేసుకుందాం, శివయ్య లాంటి ఎన్నో మంచి సినిమాలకు రచయితగా పనిచేశానని, కానీ అప్పుడు రాని నంది అవార్డు టెంపర్ సినిమాలో నటించినందుకు వచ్చిందని, కానీ అది తనకు కమ్మ అవార్డులా కనపడిందన్నారు. నంది అవార్డులు ప్రకటించడానికి ముందే ఫలానా కాంపౌండ్ కి 2 కావాలి.. ఇంకో కాంపౌండ్ కు 3 వెళ్లాలి.. ఇలా పంచేసుకుంటారని, పోసాని కృష్ణమురళి అనేవాడికి నంది అవార్డు ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు.

 posani

'టెంపర్' సినిమాకు తన కర్మకాలి నంది అవార్డు ఇచ్చారని, అక్కడ ఇవ్వడానికి ఎవరూ లేకపోవడంవల్లే ఇచ్చారన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కులాలకు, మతాలకు అసలు సంబంధం లేదని, కమ్మోళ్లు, కాపోళ్లదే పైచేయి కాదని, డబ్బుది మాత్రమే పైచేయిగా ఉంటుందన్నారు. వీడిది తమ కులం.. వీడిని డెవలప్ చేద్దామనే ఆలోచనే అసలుకు ఉండదన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంది అవార్డులను ఎంపిక చేసిన అంబికా కృష్ణను తాను ప్రశ్నించానని.. తనదేం లేదని, అందరూ కలిసి పంచుకున్నారని చెప్పారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+