5 లక్షల క్యూసెక్కుల వరద పోటు- ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ ఎత్తారు అధికారులు.

Possibility of issuing the 1st danger warning atn Prakasam Barrage as the increasing floods to the Krishna River

దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోన్న కొద్దీ వరద నీటి దిగువకు వదిలివేస్తోన్నారు.

ఈ తెల్లవారు జాము నాటికి ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే.. అంటే మొత్తం 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తోన్నారు. 15 గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తారు. మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వస్తోన్న వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు.

కృష్ణా తూర్పు కాలువ, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానెల్ కు నీటిని విడుదల చేశారు. ఈ వరద ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ఘాట్ల వద్ద స్నానం చేయడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని సూచించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తినందున కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోండటం వల్ల శ్రీశైలం డ్యామ్ నుండి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయనున్నారు. దీని ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఇక్కడ మొదటి హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+