మున్సిపల్ పోరులో పలుచోట్ల పోస్టల్ బ్యాలెట్ నిల్- ఉద్యోగుల్లో భయాలు-టీడీపీకి ఓటేస్తే !
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ కు ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దర్శనమివ్వలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ పడలేదని తెలుసుకున్న అధికారులు నేరుగా సాధారణ ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కీలకంగా తీసుకున్న కుప్పంతో పాటు పలు మున్సిపాలిటీలు, వార్డుల్లో చోటుచేసుకున్న ఈ పరిణామానికి ఉద్యోగుల్లో మల్లగుల్లాలే కారణంగా తెలుస్తోంది.

మున్సిపల్ ఓట్ల లెక్కింపు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన పలు స్ధానాల్లో ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభమైంది. ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత సాధారణ ఓట్లు లెక్కింపు చేపట్టారు. పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంట్ కాకపోవడంతో నేరుగా సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల సంఖ్య తక్కువే ఉండటంతో ఈ మధ్యాహ్నానికే ఫలితాలు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తక్కువ ఓట్లు కలిగిన మున్సిపాలిటీల్లో ఒక్కో ఓటు కీలకంగా మారడంతో అక్కడ జరిగిన పోలింగ్ సరళి రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.

కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ నిల్
రాష్ట్రంలో పలు స్ధానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినా అందులో వైసీపీ, టీడీపీ ఇద్దరికీ కీలకంగా మారింది కుప్పం మున్సిపాలిటీ మాత్రమే. ఇక్కడ దాదాపు పాతిక వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు యథావిధిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కూడా కల్పించారు. కానీ కుప్పంలో మాత్రం ఎవరూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయలేదు. దీంతో ఉదయం కౌంటింగ్ ప్రారంబించిన ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిల్ గా నిర్ధారించారు. దీంతో నేరుగా పోలైన ఓట్లను మాత్రమే లెక్కిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ కు ఉద్యోగులు దూరం
కుప్పం తరహాలోనే పశ్చీమగోదావరి జిల్లా ఆకివీడులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అస్సలు పోల్ కాలేదు. ఇలాగే రాష్ట్రంలోని పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అరకొరగా పోలయ్యాయి. దీంతో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మున్సిపల్ పోరులో తమకు పోస్టల్ బ్యాలెట్ రూపంలో లభించిన ఓటును ఎందుకు సద్వినియోగం చేసుకోకుండా దూరంగా ఉండిపోయారన్న చర్చ సాగుతోంది.

వైసీపీపై ఆగ్రహమే కారణమా ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగుల ఓట్లు ఎంతో ఉపయోగపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ తర్వాత వారికి ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో మాత్రం విఫలమైంది. అంతే కాదు రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు కోరుతున్న సీపీఎస్ రద్దు, పీఆర్సీ వంటి హామీలు అమలు కావడం లేదు. ప్రతీ నెలా ఠంచనుగా ఒకటో తేదీ జీతాలు, పించన్లు తమ ఖాతాల్లో పడతాయన్న గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడిందా అన్న చర్చ జరుగుతోంది.

ఎటూ తేల్చుకోలేక ఓటింగ్ కు దూరం ?
రాష్ట్రంలో తాజాగా జరిగిన మున్సిపల్ తో పాటు పంచాయతీ, పరిషత్ ఉపఎన్నిక్లలో సైతం ఉద్యోగుల్లో చాలా మంది పోస్టల్ బ్యాలెట్ తో పాటు సాధారణ ఓటింగ్ కు కూడా దూరంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆగ్రహంతో నెగెటివ్ ఓటు వేయలేక, విపక్ష టీడీపికి ఓటేస్తే అధికార పార్టీ నుంచి వేధింపులు తలెత్తవచ్చనే భయాలు వారిని ఓటు వేసేందుకు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లంటే ఉద్యోగుల ఓట్లనే పేరు ఉన్న నేపథ్యంలో ఇందులో టీడీపికి ఓటేస్తే అధికార పార్టీ నేతలు తమను ఎక్కడ టార్గెట్ చేస్తారేమో అన్న ఆందోళనతో వారు పోస్టల్ బ్యాలెట్ కు దూరంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. వైసీపీ పూర్తిగా బలంగా ఉన్న నెల్లూరు , కడప వంటి జిల్లాల్లో మాత్రం ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేసినట్లు అర్ధమవుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications