డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సీఎం చంద్రబాబుకు పోతిన మహేష్ సూటిప్రశ్న!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి పాలనాపగ్గాలు చేపట్టింది. మంత్రులుగా స్థానం దక్కించుకున్న వారి శాఖలు కూడా కేటాయించడంతో అందరూ పనులు మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లిన పోతన మహేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూటమిపై రెచ్చిపోయిన పోతిన మహేష్ చంద్రబాబు మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారన్నారు.
కూటమిలో సామాజిక న్యాయం ఎక్కడ?
అసలు చంద్రబాబు కూటమి లో సామాజిక న్యాయం ఎక్కడ అని ప్రశ్నించారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లింలను చంద్రబాబు అగౌరవపరిచారని పోతన మహేష్ పేర్కొన్నారు. 2014లో ఉప ముఖ్యమంత్రి పదవిని ఒకటి నిమ్మకాయల చినరాజప్పకు, మరొకటి కే కృష్ణమూర్తికి ఇచ్చారు. వీరిద్దరూ కాపు, గౌడ సామాజిక వర్గాలకు చెందినవారు.

జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు
2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ పదిమందికి ఉపముఖ్యమంత్రి పదవులను ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీ సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి సామాజిక న్యాయం పాటించారని పోతిన మహేష్ వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు పోతిన మహేష్.
కేవలం పవన్ కళ్యాణ్ కే ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా?
గతంలో జగన్ చేసిన దానికంటే మిన్నగా పని చేయాల్సిన అవసరం ఉందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కానీ అలా చేయలేదని ఆయన మండిపడ్డారు. కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మిగతా అన్ని వర్గాలను అవమానించారని, మంత్రివర్గ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించలేదని పోతిన మహేష్ అన్నారు.
పాలనా పగ్గాలు చేపట్టిన నాడే సామాజిక మోసం
పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే సామాజిక మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు, కేసులు పెట్టించుకోవలసి వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కావాలని, కానీ పదవులు ఇచ్చే సమయంలో మాత్రం వారు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు.
ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం .. ప్రశ్నించిన పోతిన మహేష్
చంద్రబాబు తమ నిర్ణయంతో ఈ వర్గాలను అవమానించారని పేర్కొన్నారు. మంత్రి పదవులు సామాజిక సమీకరణాల మేరకు చేశామని చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం అంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications