జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై.. ?
టికెట్ల పంచాయితీ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో కాకరేపుతోంది. టికెట్ దక్కని నేతలు బహరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును మూడు పార్టీల నేతలు ఆశించడంతో..ఈ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు.
టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, షేక్ నాగుల్ మీరా, వంటి వారు టికెట్ ఆశిస్తుండగా, జనసేన నుంచి పోతిన మహేష్, బీజేపీ నుంచి సుజనా చౌదరి వంటి నేతలు విజయవాడ పశ్చిమ టికెట్‌ను ఆశిస్తున్నారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును ఖారారు చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో మిగిలిన పార్టీల్లో అసంతృప్తి ఒక్కసారిగా బయపడింది.

టికెట్ ఆశించిన టీడీపీ నేత జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విజయవాడ పశ్చిమ టికెట్ తనదే అని భావించిన పోతిన మహేష్ సైతం జనసేనను వీడటానికి రెడీ అవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి.పవన్ కల్యాణ్ కూడా పోతిన మహేష్‌కు ఎమ్మెల్యే సీటు వస్తుందని హామీ ఇవ్వడంతో ..ఆయన నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి జనసేనను బలోపేతం చేశారు.
అయితే టికెట్ సుజనా చౌదరికి దక్కడంతో పోతిన మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తాను చేసిన పోరాటల వల్లే వెల్లంపల్లి నియోజకవర్గాన్ని మారారని పోతిన మహేష్ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ తనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చిన వైసీపీ నాయకులతో పోటీ పడలేరన్నారు. సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని పోతిన మహేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ పోతిన మహేష్ ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ న్యాయంగా తనకే దక్కాలని.. తాను లోకల్ అని కూటమి నేతలకు గుర్తు చేస్తున్నారాయన. దీనిపై ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన పోతిన మహేష్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అనుచరులు, కార్యకర్తలు పోతిన మహేష్‌ను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పోతిన మహేష్ ఒకటి, రెండు రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications