ఎన్నికల వేళ జనసేనకు కీలక నేత రాజీనామా - వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. సీట్లు దక్కని నేతలు పార్టీ వీడతున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన కోసం పని చేసీ..సీట్లు దక్కని నేతలు పార్టీ వీడారు. పలువురు వైసీపీలో చేరారు. విజయవాడ కు చెందిన జనసేన నేత పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పోతిన ప్రయత్నించారు. రాజీనామా చేసిన తరువాత పోతిన నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.
జనసేనలో సీట్లు దక్కని నేతలు పార్టీ వీడుతున్నారు. కోనసీమ జిల్లాలో పితాని బాలక్రిష్ణ, అమలాపురం నుంచి రాజాబాబు పార్టీని వీడారు. మరి కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్తగా పోతిన మహేష్ పని చేసారు. నియోజకవర్గం సీటు పైన చివరి వరకు ప్రయత్నించారు. కానీ, పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన మద్దతు కోసం సుజనా తాజాగా జనసేనాని పవన్ ను కలిసారు. పోతిన మద్దతు తమకు ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, సడన్ గా పోతిన తాను జనసేనకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పోతినకు సీటు కోసం పార్టీ కేడర్ కొంత కాలంగా నిరసనలకు దిగింది. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని నినదించారు. పోతిన కొద్ది రోజులగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. సీటు రాకపోతే స్వతంత్ర అబ్యర్దిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అటు వైసీపీ నేతలు పోతినతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ మైనార్టీకి కేటాయించింది. అక్కడ బీజేపీ నుంచి సుజనా పేరు ప్రకటనతో సమీకరణాల్లో మార్పులు మొదలయ్యాయి. దీంతో, పోతిన తీసుకొనే నిర్ణయం ఏంటి.. ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారుతోంది. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురయి రాజీనామా చేసారు. దీంతో, పోతిన నెక్స్ట్ అడుగులు ఏంటనేది విజయవాడ వెస్ట్ లో రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications