బిసీలకు వైయస్ అన్యాయం: బాబు, తీర్మానం
హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం తమ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు తీసుకువస్తామని ప్రకటించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని తెలిపారు. వైఎస్ హయాంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. చేతివృత్తులవారు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కుల వృత్తులపై పన్నులను ఎత్తివేస్తామని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆరోగ్య భీమా కల్పిస్తామని, జిల్లాల్లో చేనేత పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మూతపడిన చేనేత సంఘాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వేటకు వెళ్లని సమయంలో బియ్యం పంపిణీ చేస్తామని బాబు వెల్లడించారు. జాలర్లకు డీజిల్‌పై సబ్సిడీ ఇస్తామని చెప్పారు.
గీత వృత్తిని ప్రోతహిస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ముదిరాజ్, వడ్డెర సొసైటీలు దెబ్బతిన్నాయన్నారు. దొంగ బంగారం పట్టుబడితే స్వర్ణకారులపై కేసులు పెడుతున్నారని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications