ఇంకెవరి కోసం బతకాలి?: బోరున ఏడ్చిన ప్రభు.. అశ్విక మృతదేహం చూసి గుండెలవిసేలా!

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా నదిలో బోటు విషాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. సీపీఐ నారాయణకు బంధువైన ప్రభు కిరణ్ తల్లి, భార్య, కుమార్తెలు ముగ్గురు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

  Krishna river boat capsized : సింగపూర్‌ టూరిజం కాదు, సేఫ్టీ టూరిజం కావాలి | Oneindia Telugu

  ప్లీజ్ నచ్చజెప్పండి: నారాయణకు అఖిల ఫోన్, 'భ్రమల్లో పెట్టి ఇదా మీరు చేసేది?'

  తల్లి లలితాదేవి, భార్య హరితల మృతదేహాలు సోమవార ఉదయమే లభ్యమవగా.. కుమార్తె మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైనట్టు తెలుస్తోంది. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బంది అశ్విక మృతదేహాన్ని కృష్ణానదిలో గుర్తించారు.

   పోస్టుమార్టం:

  పోస్టుమార్టం:

  అశ్విక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టమ్ పూర్తవగానే ఆమె స్వస్థలమైన నెల్లూరు తరలిస్తారు. అశ్విక మృతదేహం దొరకడంతో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 22అ కు చేరింది.

   నారాయణ జోక్యంతో:

  నారాయణ జోక్యంతో:

  అంతకుముందు భార్య హరిత, తల్లి లీలావతిల మృతదేహాలను తీసుకెళ్లేందుకు భర్త ఒప్పుకోలేదు. కుమార్తె మృతదేహాన్ని వెలికితీసేదాకా అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. చివరకు మంత్రి అఖిలప్రియ సీపీఐ నారాయణకు ఫోన్ చేసి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నారాయణ జోక్యంతో వారి మృతదేహాలను గూడూరుకు తరలించినట్టు సమాచారం.

   ఎవరి కోసం బతకాలి?:

  ఎవరి కోసం బతకాలి?:

  తల్లి, భార్య, కుమార్తె.. ముగ్గురూ బోటు ప్రమాదంలో చనిపోవడంతో ప్రభు కిరణ్ మానసికంగా కుమిలిపోతున్నాడు. గారాలపట్టి అశ్విక మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు. తానింకా ఎవరికోసం బతకాలని రోధిస్తున్నాడు. తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని దు:ఖిస్తున్నాడు. ప్రభు కిరణ్ ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. కాగా, లీలావతి, హరిత, అశ్విక అంత్యక్రియలు నెల్లూరులో జరగనున్నట్టు తెలుస్తోంది.

   బోటు ఎక్కించిన ప్రభుకిరణ్:

  బోటు ఎక్కించిన ప్రభుకిరణ్:

  కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో భవానీ ఐలాండ్ కు వెళ్దామనుకున్నారు. కుమార్తె అశ్విత కూడా బయటకు వెళ్దామని మారాం చేయడంతో ఇంటి నుంచి బయలుదేరారు. పవిత్ర సంగమం వద్ద హారతులను చూడాలనుకోవడంతో.. ప్రభు కిరణ్ వారిని బోటు ఎక్కించి ఇంటికొచ్చారు. గంట వ్యవధిలోనే బోటు బోల్తా పడినట్టు వార్తలు రావడంతో షాక్ తిన్నాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Atlast Rescue team found Ashwika's dead body in Krishna river, Her father Prabhu Kiran cried after seeing that dead body.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి