వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌జారాజ్యం అందుకే విఫ‌లం :బ‌ల‌మైన చిరంజీవిని బ‌ల‌హీనుడిగా మార్చేసారు : ప‌వ‌న్ ఆవేద‌న‌..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ ల‌క్ష్యం..చిరంజీవి క‌ష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి న‌ష్టం చేసారు వంటి అంశాల పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వాట‌న్నింటినీ గుర్తు చేసుకొని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు ప‌రిస్థితుల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ గుర్తు చేసుకున్నారు. పీఆర్పీ ఉంటే సామా జిక న్యాయం జరిగి ఉండేదని.. ఓపిక లేని నాయకులు చేరడం వల్ల అవకాశం చేజారిందని పవన్‌ అన్నారు. పీఆర్పీ ఏర్పాటులో బలమైన పాత్ర పోషించానని, చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని పవన్ చెప్పు కొచ్చా రు. ప్ర‌జా రాజ్యంలో చేరిన‌ నేతలు పదవీ వ్యామోహంతో.. చిరంజీవిలాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, పెన్షన్లు, రేషన్‌ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించే ఓపిక నేతల్లో లేదన్నారు.

Prajarajyam is experience : very care on Janasena committees..

సంక్లిష్ట ప‌రిస్థితుల్లో జ‌న‌సేన ఏర్పాటు..

సంక్లిష్ట ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌ను స్థాపించాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ చెప్పుకొచ్చారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయ ని , ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు కావాలంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించా రు. రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదన్నారు. ప్రజరాజ్యం అనుభ వాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కమిటీల నియమకాలకు తొందరపడలేదన్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే కనీసం 25 ఏళ్లు ఓపిక పట్టాలని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతున్న ట్లు పేర్కొన్నారు. ప్ర‌జారాజ్యంలో లోపాలు ఎక్క‌డా పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకొని..క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసారు.

English summary
Pawan Kalyan shared his Praja Rajyam memories with Janasena Leaders in party meeting. He stated that some leaders mis guide Chiranjeevi and lost his political carrier. But, In janasena such incidents should not happen says Mr Pawan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X