బొక్క బోర్లా పడ్డ ప్రచారం : బెడిసి కొట్టిన టీడీపీ పబ్లిసిటీ
విజయవాడ : హైటెక్ బాబుగా ముద్రపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు.. విషయమైదైనా ప్రచార ఆర్భాటం లేకుండా పని ప్రారంభించరన్నది జగమెరిగిన సత్యం. అందునా..! మీడియా మేనేజ్ మెంట్ కు కేరాఫ్ అయినా తెలుగుదేశం పార్టీకి.. పబ్లిసిటీ ఇచ్చే మీడియా ఎప్పుడూ వెన్నంటే ఉండడం ఆయన ప్రచారాలకు కలిసొచ్చే అంశం. అయితే ప్రచారాస్త్రాలను సంధించడంలోను జనం మరీ అమాయకులు అన్న రీతిలో వ్యవహరించడం తెలుగుదేశం పార్టీని అభాసుపాలయ్యేలా చేస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే.. కృష్ణా పుష్కరాల ప్రచారానికి మరింత కలరింగ్ ఇవ్వబోయి బొక్క బోర్లా పడ్డారు తెలుగు తమ్ముళ్లు. పుష్కరాల నేపథ్యంలో జిగేల్ మంటోన్న ప్రకాశం బ్యారేజీ గ్రాఫిక్స్ ఫోటోలను కొన్ని సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. అయితే తీరా తేలిందేంటంటే.. ఆ ఫోటోలు సౌత్ కొరియాలోని బన్ఫో అనే బ్రిడ్జికి సంబంధించినవని.
దీంతో.. ప్రచారం కోసం వేసిన ఎత్తుగడ కాస్త బెడిసికొట్టినట్టయింది. ఈ తరహా ప్రచారం పార్టీ నుంచే జరిగిందో లేక మరెవరైనా చేశారో తెలియదు గానీ మొత్తానికి గ్రాఫిక్ ఫోటోల పబ్లిసిటీ కాస్త.. వట్టి పుకారు గా మిగిలిపోయింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications