'ముందస్తు': జగన్‌తో రూ.250 కోట్ల ఒప్పందం.. తూచ్, కొట్టిపారేసిన ప్రశాంత్ కిషోర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రూ.250 కోట్ల ఒప్పందంతో వచ్చే ఎన్నికల కోసం పని చేస్తున్నాడన్న వార్తల పైన ఎన్నకల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారని తెలుస్తోంది.
2019 ఎన్నికల కోసం వైసిపికి పని చేసేందుకు తాను ఎలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వార్తలను ప్రశాంత్ కిషోర్ కొట్టి పారేశారు. అవన్నీ అవాస్తవ ప్రచారాలు అని ఆయన కొట్టి పారేశారు.
ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదికలోను స్పందించారు. మేం ఎప్పుడు కూడా హైర్ బేసిస్ మీద పని చేయమని, అలాంటప్పుడు రూ.250 కోట్లకు తమను హైర్ చేసుకున్నారనే వాదనలో నిజం ఎక్కడుందని ప్రశ్నించారు.

భారీ ఒప్పందం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌తో రూ.250 కోట్లకు ఆ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో..
కేంద్రంలో, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పైన జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ సదరు ఎన్నికల వ్యూహకర్తతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోందని ప్రచారం జరిగింది.

ఏపీ రాజకీయ పరిస్థితులను స్టడీ చేసి..
ప్రశాంత్ కీషోర్ టీం.. తొలుత రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను స్టడీ చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకత పైన కూడా సమాచారం సేకరిస్తుందని వార్తలువచ్చాయి.

వైసిపికి పని చేస్తారా?
అంతేకాదు, ప్రశాంత్ కిషోర్ వైసిపి నేతలతో పలుమార్లు భేటీ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారట.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications