వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలవురోజు డ్యూటీకి ట్రెజరీ ఉద్యోగులు: ఆ శాఖలకు జీతాల ప్రాసెస్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో నెలకొన్న పీఆర్సీ చిక్కుముడి వీడట్లేదు. ఇంకో రెండు రోజుల్లో వేతనాలు అందుకోవాల్సిన ఉన్న ఈ దశలోనూ పీఆర్సీ అంశం కొలిక్కి రావట్లేదు. ఇందులో నెలకొన్న ప్రతిష్టంభన యధాతథంగా కొనసాగుతోంది. కొత్త వేతన పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం జీవోలను జారీ చేయడం, వాటిని మంత్రివర్గం ఆమోదించడంతో ఈ వివాదం మరింత రాజుకున్నట్టయింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు, పీఆర్సీ సాధన సమతి ప్రతినిధులను చర్చలకు పిలుస్తున్నప్పటికీ- వారు హాజరు కావట్లేదు.

ట్రెజరీ ఉద్యోగులకు నోటీసులు వెళ్లినా..

ట్రెజరీ ఉద్యోగులకు నోటీసులు వెళ్లినా..


జనవరి నెల వేతనాలను చెల్లించడానికి అవసరమైన ప్రాసెసింగ్‌ను చేపట్టాలంటూ ప్రభుత్వం ట్రెజరీ శాఖ ఉద్యోగులను ఆదేశించినప్పటికీ.. వారు పట్టించుకోవట్లేదు. విధులకు హాజరు కావట్లేదు. దీనికోసం ఇప్పటికే పలుమార్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ట్రెజరీ ఉద్యోగులకు ఆరుసార్లు నోటీసులు వెళ్లాయి. 11వ పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లిస్తామంటూ ప్రభుత్వం, మంత్రులు చేసిన ప్రకటనను ట్రెజరీ ఉద్యోగులు సైతం వ్యతిరేకిస్తోండటం, విధులకు హాజరు కాకపోవటమే దీనికి కారణం.

వేతనాల ప్రాసెసింగ్..

వేతనాల ప్రాసెసింగ్..

ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేయాలని, విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని మళ్లీ మళ్లీ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు మాత్రం మెట్టు దిగట్లేదు. ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ అనూహ్యంగా ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ- వారు విధులకు హాజరయ్యారు. వేతనల ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నారు.

కొన్ని శాఖలకే

కొన్ని శాఖలకే


మూడు శాఖల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఆ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించేలా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి- న్యాయస్థానాలు, రెండు- పోలీస్ శాఖ. ఈ రెండు శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల జీతాలను చెల్లించేలా ట్రెజరీ సిబ్బంది తమ ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారని సమాచారం. దీనికోసం 50 శాతం మంది ట్రెజరీ ఉద్యోగులు హాజరయ్యారని అంటున్నారు.

జిల్లా కేంద్రాల్లో మాత్రమే..

జిల్లా కేంద్రాల్లో మాత్రమే..

జిల్లా కేంద్రాల్లో గల ట్రెజరీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది మాత్రమే విధులకు హాజరైనట్లు సమాచారం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్ మొత్తాన్ని ఇదివరకే ప్రాసెస్ చేశారు. సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కొత్త పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని మెమోల్లో స్పష్టంగా పొందుపరిచింది. అయినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదు.

Recommended Video

PRC Issue In AP: సమ్మె వద్దు.. చర్చించుకుందాం AP Govt VS Employees | Oneindia Telugu
 హెచ్చరించినా..

హెచ్చరించినా..

కొత్త పేస్కేళ్లను ఆమోదిస్తూ జారీ చేసిన జీవోల ప్రకారం వేతనాలు చెల్లించేలా సర్కులర్లు జారీచేస్తున్నప్పటికీ వారు పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. నిజానికి- ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, పింఛన్ మొత్తానికి సంబంధించిన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రతీ నెలా 25వ తేదీ నాటికి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా వేతన సవరణకు సంబంధించిన వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రాసెసింగ్ అనేది స్తంభించిపోయింది. ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలను మంజూరు చేయడానికి సుముఖంగా ఉండట్లేదు. ఫలితంగా ఆర్థికమంత్రిత్వ శాఖ పలుమార్లు మెమోలు, సర్కులర్లను జారీ చేయాల్సి వచ్చింది.

English summary
PRC row: AP treasury employees attend for their duties to process the salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X