సమూలంగా మారిపోయిన ఏపీ జిల్లాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కొత్త జిల్లాలను ఖరారు చేసింది. మొత్తం మూడు కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. మదనపల్లి, మార్కాపురం, పోలవరంలను జిల్లాలుగా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆయా జిల్లాల్లో కొత్తగా చేరిన మండలాల పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి.

మదనపల్లి జిల్లాలో- మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళ్లపల్లి, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బీ కొత్తకోట.. ప్రస్తుతం ఇవి అన్నమయ్య రాయచోటి జిల్లాలో ఉన్నాయి. ఇవి మదనపల్లి జిల్లాలో విలీనం అయ్యాయి. అలాగే- చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి, పుంగనూరు కూడా మదనపల్లి జిల్లా పరిధిలోకి వచ్చాయి.
దీంతో పాటు కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్ ఆవిర్బవించింది. చిత్తూరు, పలమనేరు డివిజన్ల పరిధిలోని సొదుం, సోమలతో పాటు రాయచోటి మదనపల్లి పరిధిలోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకీపురం పీలేరు డివిజన్ పరిధిలోకి వచ్చాయి.
పోలవరం జిల్లాలో.. రంపచోడవరం, దేవీపట్నం, గుత్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఏటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. వాటిని పోలవరం రంపచోడవరం జిల్లాలోకి తీసుకొచ్చారు. రంపచోడవరం, చింతూరు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడ్డాయి.
మార్కాపురం జిల్లాలో.. గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, మార్కాపురం, తర్లపాడు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్దచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు మండలాలు విలీనం అయ్యాయి. ఈ జిల్లాలో మార్కాపురం, కనిగిరి.. కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఆవిర్భవించాయి. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ ను ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ సాయి ప్రసాద్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications