వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్ (ఫోటోలు)

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తాను ఎన్నోసార్లు తిరుమలకు వచ్చినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వేంకటేశ్వర భక్తి ఛానెల్‌‌తో మాట్లాడుతూ వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందానని ఆయన అన్నారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కల్పించాలని దేవుడిని ప్రార్ధించినట్టు పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి వెళ్లారు.

తిరుమల పర్యటనలో భాగంగా ఆయనతో పాటు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటనలో గవర్నర్ నరసింహాన్, సీఎం చంద్రబాబు, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ఉన్నారు.

చివరగా స్వామివారి తీర్ధ ప్రసాదాలను రాష్ట్రపతికి అందించి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల ఆలయ క్షేత్ర సంప్రదాయాన్ని పాటించారు. తొలుత శ్రీ వరాహస్వామని దర్శించుకున్నారు.

ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు స్వాగతం పలికారు. మేళతాళాలతో రాష్ట్రపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాహన శ్రేణిలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

కాన్వాయ్‌లోని రాష్ట్రపతి వాహనానికి ముప్పు తప్పింది. రాష్ట్రపతి వాహన శ్రేణి తిరుమలకు వెళ్తుండగా అలిపిరి వద్ద కాన్వాయ్‌లోని వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, వెంటనే ఢీకొన్న వాహనాన్ని పోలీసులు క్రేన్‌తో తొలగించారు. అనంతరం కాన్వాయ్ వెళ్లిపోయింది.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుపతిలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో టిటిడి అధికారులు తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు.

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

1.15 గంటలకు రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ప్రణబ్‌ కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నవగ్రహ పూజలో పాల్గొన్నారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్‌కు టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజులు స్వాగతం పలికారు. వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి శ్రీవారి ఆలయానికి వచ్చారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నర్సింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన పర్యటనకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని నిలిపివేశారు. ఆయన మధ్యాహ్నాం రాష్ట్రపతి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ తిరుమలకు రావడం ఇది మూడోసారి. రాష్ట్రపతి వెంట ఆయన కుమారుడు, గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రపతి రాకతో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు.

 వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

అంతక ముందు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు.

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం బయలుదేరి వెళ్లారు.రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకోనున్న రాష్ట్రపతి ప్రణబ్‌‌కు గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+