స్వామి సేవలో ప్రణబ్: సర్వదర్శనం నిలిపివేత, వెంట గవర్నర్, బాబు

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి పద్మావతి అతిధిగృహానికి బయలుదేరివెళ్లారు. ఆయన పర్యటనకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని నిలిపివేశారు. ఆయన మధ్యాహ్నాం స్వామివారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం వరకు ప్రణబ్‌ తిరుమలలో గడపనున్నారు. రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకుని వచ్చేంతవరకు అన్ని దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ తిరుమలకు రావడం ఇది మూడోసారి. రాష్ట్రపతి వెంట ఆయన కుమారుడు, గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రపతి రాకతో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు.

President to worship at Lord Venkateswara temple today

అంతక ముందు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం బయలుదేరి వెళ్లారు.రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకోనున్న రాష్ట్రపతి ప్రణబ్‌‌కు గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+