రాష్ట్రపతి ఎన్నిక: ఏపీలో, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు నవ్యాంధ్ర రాజధానిలో, తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాదులో ఓటు వేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు: తొలి ఓటు వేసిన చంద్రబాబు, హైదరాబాద్‌లో కేసీఆర్

ఏపీలో ఎవరికెన్ని ఓట్లు?

ఏపీలో ఎవరికెన్ని ఓట్లు?

ఏపీలో అధికార టిడిపి, బిజెపి, ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే పడనున్నాయి. నవ్యాంధ్రలో ఎమ్మెల్యేల ఓట్లు 27,666. ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు పడే ఎంపీల ఓట్ల విలువ 22,656.

దేశవ్యాప్తంగా ఎంపీలకు ఓటు విలువ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏపీ ఎంపీల ఓటు విలువ కూడా 708 పాయింట్లు. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఒక్కో ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలువ 159.

Ramnath Kovind vs Meira Kumar : Dalit vs Dalit battle | Oneindia News
భూమా మృతితో..

భూమా మృతితో..

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల మృతి చెందారు. మిగతా వాళ్లు ఓటు వేయనున్నారు. 174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక, ఏపీ నుంచి విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. వారి ఓటు విలువ 2,832. ఏపీలో 174 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. విపక్షాల అభ్యర్థికి ఓట్లు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వేయనున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు.

తెరాస నుంచి 90 ప్రజాప్రతినిధులు ఉన్నారు. బిజెపికి ఐదుగురు, టిడిపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేస్తారు. మజ్లిస్ తటస్థంగా ఉంటుంది. మిగతా వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరు మీరా కుమార్‌కు ఓటు వేస్తారు.

తెలంగాణలో ఓటు విలువ..

తెలంగాణలో ఓటు విలువ..

తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కో ఓటు విలువ 132. మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. లోకసభ, రాజ్యసభ ఎంపీలు 24 మంది. ఇటీవల రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. దీంతో 23 మంది ఉన్నారు. వీరి ఓటు విలువ 16,284. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 31,992 పాయింట్లు.

తెరాసకు 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో తెరాస ఓటు విలువ 23,916. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఈ పార్టీ ఓట్ల విలువ 1,368. టిడిపి ఓట్ల విలువ 396. వీరంతా కోవింద్‌కు ఓటేస్తారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు కాంగ్రెస్ సభ్యులు ఓటు వేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. వీరి ఓట్ల విలువ 4,548.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLAs of Telugu Desam, YSR Congress from Andhra Pradesh and Telangana Rastra Samithi from Telangana State are voting for NDA presidential candidate.
Please Wait while comments are loading...