సుమోటాగా ఏపీ సర్కారు జీవో: సీఎస్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటీవల జారీ చేసిన జీవో 2430 మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. ఈ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంతేగాక, జీవోపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. 2430 జీవో జర్నలిస్టుల విధి నిర్వహణకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. కలానికి కళ్లెం వేసే జీవోను సుమోటోగా తీసుకుంది.

 press council of india responds on AP govt GO 2430

ఏపీ సర్కారు విడుదల చేసిన 2430జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాక, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, సంస్థలపై చర్యలు తీసుకోనుంది.

ఈ అధికారాన్ని ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు అప్పగించడం జరిగింది. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. న్యాయపరంగా కేసులు కూడా దాఖలు చేయడం జరుగుతుంది. ఈ జీవోకు అక్టోబర్ 16న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ జీవోను విడుదల చేశారు.

కాగా, ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ జీవోపై మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+