రైతులకు శుభవార్త.. రేపే అకౌంట్ లోకి డబ్బులు
ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ద్వారా కేంద్రం అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రమే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వేస్తోంది. ఈ ఆరువేల రూపాయలు ఒకేసారి రావు.. విడతలవారీగా వస్తాయి. సంవత్సరానికి మూడుసార్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నగదు వస్తోంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 13 విడతల డబ్బును ఖాతాల్లో జమచేసింది.
తాజాగా 14వ విడత నగదు రావాల్సి ఉంది. జులై 27వ తేదీన అవి ఖాతాల్లో జమ కానున్నాయి. అప్పుడు రైతులకు 14 విడతల డబ్బులు వచ్చినట్లవుతుంది. ఇప్పటివరకు రూ.28వేల ఇచ్చినట్లు లెక్క. ఈసారి ఈ పథకం కింద డబ్బులు పొందేవారి సంఖ్య పెరిగింది. ఎక్కువమంది రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకోబోతున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 8.1 కోట్ల మందికి లబ్ది కలుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13వ ఇన్‌స్టాల్‌మెంట్ వీరందరికీ అందిందని, మొదటి విడత కింద 3.16 కోట్ల మంది ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారు.

2018 డిసెంబర్ నుంచి పరిశీలిస్తే కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందినవారు 3.16 కోట్ల నుంచి 8.11 కోట్లకు పెరిగినట్లు సభలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లబ్ధిదారుల సంఖ్య ఒకానొక సమయంలో 10 కోట్లు కూడా దాటింది. ఆ తర్వాత మాత్రం క్రమేణా సంఖ్య తగ్గుతూ వచ్చింది. అర్హత లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఇలాంటివారిని గుర్తించి తొలగించారు. 14వ విడత డబ్బులు పొందాలంటే కచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలి. లేకపోతే డబ్బులు రావు. ఈ కేవైసీ చేయనివారెవరైనా ఉంటే త్వరగా చేసుకోవాలి.












Click it and Unblock the Notifications