నేడు ఏపీకి ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే !
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలానే డ్రోన్ సిటీకి శంకుస్థాపన వంటి ముఖ్య కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొంటారు. ఈ క్రమంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మోడీ షెడ్యూల్ ఇదే..
- ప్రధాని మోడీ ఉదయం 9:50 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలిప్యాడ్‌కు బయలుదేరి.. తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు.
- ఉదయం 10:55 గంటలకు శ్రీశైలం చేరుకుని.. 11:15 గంటల నుండి 12:15 గంటల వరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తారు.

- మధ్యాహ్నం 12:05 గంటలకు ప్రధాని బయలుదేరి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
- 12:40 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత 1:40 గంటలకు సున్నిపెంట నుండి కర్నూలుకు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
- మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని పాల్గొంటారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించిన రూ.13,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.
- ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
- ఆ తర్వాత, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలతో కలిసి 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
- సాయంత్రం 4:45 గంటలకు కర్నూలు విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు.
కాగా మోడీ కర్నూలు పర్యటన కోసం కూటమి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రధాని సభకు భారీ జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. దాదాపు మూడు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 7 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భద్రత కోసం 7,500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, మంత్రులు, కర్నూలు జిల్లా నేతలతో మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications