చంద్రబాబుకు కీలక పదవి.. మోడీ, షా ఆఫర్?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కేంద్రంలో 400 లోక్ సభ స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ఘనంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో నరేంద్రమోడీ, అమిత్ షా ఉన్నారు. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి వారిని నిరాశపరిచింది. 400 స్థానాల సంగతి తర్వాత.. మెజారిటీకి అవసరమైన 272 వస్తాయా? అన్న సందేహంలో పడిపోయారు.

చంద్రబాబు అవసరం పడిందే..
అందరి విశ్లేషణలు, అంచనాల ప్రకారం భారతీయ జనతాపార్టీ సారి మిత్రులపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందికానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని తేల్చిచెబుతున్నారు. ఇటువంటి తరుణంలో మోడీ, షాకు చంద్రబాబునాయుడి అవసరం పడింది. ఇండియా కూటమిలో ఉన్న ఎంతోమంది నేతలతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఒకవేళ మెజారిటీకి అవసరమైన సీట్లు తగ్గే పక్షంలో చంద్రబాబు ద్వారా ఇండియా కూటమిలోని నేతలను ఆకర్షించాలని భావిస్తున్నారు.

prime minister narendra modi and home minister amit shah will take chandrababu naidu help

కూటములు కట్టడంలో అనుభవం
వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీయే కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగారు. జాతీయ స్థాయిలో కూటములు ఏర్పాటు చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. ప్రస్తుతం మోడీ, షా మాట వింటేనే ఇతర రాజకీయ పక్షాలన్నీ మండిపడుతున్నాయి. గతంలో చంద్రబాబు రాజకీయాన్ని గుర్తుచేసుకున్న మోడీ, షా అవసరమైతే, లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఎన్డీయే కన్వీనర్ పదవి చంద్రబాబుకిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్డీయేకు 220 నుంచి 230కి మించి సీట్లు రావని, అలాగే ఇండియా కూటమికి 200 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఈ రెండు కూటములకు ఇతర పార్టీలు అవసరమవుతాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే చంద్రబాబుతో ఉన్న పాత వైరాన్ని మరిచి మోడీ, షా కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. జూన్ నాలుగున వచ్చే ఫలితాల సరళిని బట్టి ఇది జరుగుతుంది. అప్పటివరకు వేచిచూడటమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+