Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ఇలా (ట్వీట్స్)

అమరావతి: అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన, ఆ తర్వాత తిరుమల పర్యటనపై తన అభిప్రాయాలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చరిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని, ప్రపంచ స్థాయి నగరం నిర్మించేందుకు ముందడుగు వేసిందని ఆయన తెలిపారు. ఆపై వరుస ట్వీట్లు చేస్తూ, పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నది నీటిని తీసుకువెళ్లి అమరావతిలో చంద్రబాబుకు అందించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

Prime minister narendra modi tweets on amaravati

అక్కడ కొన్ని తెలుగు మాటలు మాట్లాడానని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించానని ఆయన గుర్తు చేసుకున్నారు. తిరుమలలో బాలాజీని దర్శించుకుని ప్రార్థనలు జరిపానని, అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని, దీంతో యాత్రికులకు, ప్రయాణికులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు.

ఏపీలో మరో కొత్త సంస్థ శ్రీ వెంకటేశ్వరా మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+