చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారుల షాక్ .. అచ్చెన్నాయుడిని కలవటానికి నో పర్మిషన్
ఏపీ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు.ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి అనుమతించాలని కోరిన బాబుకు అనుమతి నిరాకరించారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన టిడిపి ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అనారోగ్య కారణంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అచ్చెన్నను పరామర్శించాలనుకున్న బాబుకు జైళ్ళ శాఖ షాక్
అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నను పరామర్శించాలి, ఆయనకు ధైర్యం చెప్పాలి అనుకున్న చంద్రబాబు జైళ్ళశాఖ అధికారులకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది జైళ్ళ శాఖ. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదంటూ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. కరోనా బూచిని చూపించి పర్మీషన్ కు నో అన్నారు .

మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలన్న ఆస్పత్రి సూపరిండెంట్
ఇక మరో మార్గంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రి సూపరిండెంట్ ను టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని కలవటానికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక అక్కడ కూడా మాజీ సీఎం కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రిమాండ్ లో ఉన్నారని మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని,అలా కాకుంటే కలవడానికి వీలు లేదని సూపరిండెంట్ సమాధానమిచ్చారు. ఒక చంద్రబాబు నాయుడుకే కాదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సైతం అధికారులు అనుమతి నిరాకరించారు.

అచ్చెన్న అరెస్ట్ విషయంలో ఇంకా ఆగ్రహ జ్వాలలు
అచ్చెన్నాయుడును పరామర్శించటానికి కూడా అవకాశం లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక ఈఎస్ఐ స్కాం లో వైసీపీ కావాలని అచ్చెన్నాయుడిని ఇరికించింది అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రపంచ ఆర్థిక నేరస్థుల లిస్టులో ఉన్నాడని , ఆర్ధిక నేరస్తుడికి అధికారం అప్పగిస్తే ప్రతి ఒక్కరూ నేరగాళ్లు లాగా కనిపిస్తారని అందుకే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు . టెర్రరిస్టును పట్టుకున్నట్లుగా అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు .

టీడీపీ నేతలు ఏం అన్నా అనుకున్నదే చేస్తున్న సర్కార్
ఏపీ సీఎం జగన్ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగితే వారికి పార్టీ కండువా కప్పుతారని , లేదంటే జైలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో అమలు చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి జగనే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు . నిన్న అచ్చెన్న.. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనా టీడీపీ నేతలు ఎంతగా మాటల దాడి చేసినా ప్రభుతం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇక ఈ వ్యవహారంలో అన్ని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ పేర్కొనటం ముఖ్యమైన విషయం .
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications