బాధపడ్తున్నా: స్పీకర్, ప్రివిలేజ్‌కి.. వైసిపిని ఏంచేద్దాం? మార్షల్స్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు పైన ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. వైసిపి సభ్యుల పైన టిడిపి ప్రివిలేజ్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే, అసెంబ్లీలోకి మార్షల్స్‌ను ఎలా అనుమతించారంటూ వైసిపి సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. తమ హక్కులను కాలరాశారని ప్రివిలేజ్‌కు వైసిపి ఫిర్యాదు చేయనుంది.
సభలో శుక్రవారం నాడు గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే. సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి రెండు గంటలకు ప్రారంభమైన సభ రేపటికి (శనివారం)కు వాయిదా పడింది. అంతకుముందు సభలో వైసిపి సభ్యులు గందరగోళం సృష్టించారు.
వైసిపి సభ్యులు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. స్పీకర్ వద్ద ఉన్న మైక్‌ను లాగి పడేశారు. స్పీకర్‌కు మార్షల్స్ రక్షణగా నిలిచారు. స్పీకర్ పైకి కాగితాలు విసిరేశారు. శ్రీనివాసులు, రామకృష్ణా రెడ్డిలు కుర్చి పైకి ఎక్కి నినాదాలు చేశారు. స్పీకర్‌కు రక్షణగా నిలిచిన మార్షల్స్‌ను లాగి పడేశారు. మార్షల్స్, వైసిపి సభ్యుల మధ్య తోపులాట జరిగింది.

ఆవేదన చెందుతున్నా: స్పీకర్
సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు బాధాకరమని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అసెంబ్లీ వాయిదా పడక ముందు సభలో అన్నారు. సభ్యుల ప్రవర్తనతో ఆవేదన చెందుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications