జగన్‌కు షాక్: ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్య!, బాబు ఏడిపించారని పెద్దిరెడ్డి

అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని, విధ్వంసానికి పాల్పడినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అయిదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని, విధ్వంసానికి పాల్పడినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అయిదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తద్వారా వైసిపి అధినేత జగన్‌కు షాకిచ్చారు.

వీరిలో దాడిశెట్టి రాజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, బి ముత్యాల నాయుడు, కె శ్రీనివాసులు ఉన్నారు. శనివారం నాడు హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాలులో ప్రివిలేజెస్ కమిటీ సమావేశమయింది.

చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో సమావేశమయింది. సభ్యుల పైన చర్య తీసుకునే అంశంపై చర్చించారు.

ఎమ్మెల్యేలపై చర్చలు తీసుకోవద్దని కమిటీలో సభ్యుడైన వైసిపి ప్రజాప్రతినిధి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై ఎమ్మెల్యేలు సభలో చర్చ కోసం పట్టుబడటం మామూలేనని చెప్పారు. అనంతంర అయిదుగురిపై సిఫార్సు చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ys jagan

గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ సమావేశాలను అడ్డుకున్నారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్‌ స్థానం వద్దకు దూసుకెళ్లి రభస సృష్టించడం, కొందరు అసెంబ్లీ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సభా హక్కుల కమిటీతో విచారణ జరిపించాలని అసెంబ్లీ తీర్మానించింది.

సూర్యారావు నేతృత్వంలో కమిటీ విచారణ జరిపింది. కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఆరుగురు అధికార పార్టీ వారు కాగా, ఒకరు వైసిపికి చెందిన పెద్దిరెడ్డి. టిడిపి నుంచి కురుగొండ్ల రామకృష్ణ, బీసీ జనార్ధన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, జ్యోతుల నెహ్రూ, బాలకృష్ణలు ఉన్నారు. కాగా, ఈ సమావేశానికి బాలకృష్ణ, జ్యోతుల హాజరు కాలేదు.

అసెంబ్లీ లోపల ఉన్న కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా మొత్తం 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పిలిపించి ఆ దృశ్యాలు చూపించి వివరణ కోరింది.

వీరిలో అయిదుగురు ఎమ్మెల్యేల తీరు, వారి సమాధానాలపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు తమకు తెలియకుండా జరిగిన తప్పిదమంటూ క్షమాపణ కోరడంతో వారి విషయం పక్కన పెట్టారు. శనివారం జరిగిన తుది సమావేశంలో అయిదుగురిపై చర్చకు సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తమ నివేదికను ఫిబ్రవరి మొదటి వారంలో స్పీకర్‌కు అందిస్తామని చైర్మన్‌ సూర్యారావు తెలిపారు. ఈ నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని, తన అసమ్మతి నోట్‌ను విడిగా ఇచ్చానని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.

ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం కొత్తేమీ కాదని, గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలకు బాధపడి ఉపసభాపతి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. నివేదికను స్పీకర్‌ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+