స్వర్ణ రథం ట్రయల్ రన్‌లో అపశృతి: దిగబడిన చక్రం

తిరుపతి: తిరమల శ్రీవారి స్వర్ణరథం ట్రయల్ రన్‌లో అపశృతి చోటుచేసుకుంది. తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్ సోమవారం ఉదయం ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా జరిగింది.

ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి.

Problem in Swarna Patra trail run

మట్టిలో దిగబడిన రథాన్ని లాగే ప్రయత్నంలో మోపు తాడు తెగిపోయింది. ఇందులో ఇద్దరు భక్తులు గాయపడ్డారు.దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సిబ్బంది బయటకు తీశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈ స్వర్ణ రథాన్ని వాడనున్నారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా శ్రీవారి స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులతో ఏర్పాటు చేశారు. బరువు 28 టన్నులు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వెచ్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+