ప్రొద్దుటూరు మున్సిఫల్ చెర్మెన్ ఎన్నిక రేపే: రఘుమారెడ్డే ఛైర్మెన్, రాజీఫార్మూలా ఇదే!
ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ పదవికి సోమవారం నాడు ఎన్నిక జరగనుంది.
కడప:ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ పదవికి సోమవారం నాడు ఎన్నిక జరగనుంది. టిడిపిలో రెండు వర్గాలు మున్సిపల్ చైర్మెన్ పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండు సార్లు ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి.అయితే ఇదే తరుణంలో సోమవారంనాడు మున్సిఫల్ ఛెర్మెన్ కు ఎన్నికలు జరగనున్నాయి.
అధికారపార్టీలో రెండు గ్రూపుల మద్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా రెండు దఫాలు మున్సిఫల్ చెర్మెన్ ఎన్నికలు వాయిదాపడ్డాయి.అయితే గత మాసంలో రెండోదపా ప్రొద్దుటూరు మున్సిఫల్ చెర్మెన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతేకాదు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పార్టీ యంత్రాంగాన్ని ఆయన గత మాసంలోనే ఆదేశించారు.
అయితే ఛైర్మెన్ పదవి కోసం రెండు గ్రూపులు కూడ పట్టువిడుపులను ప్రదర్శించడం లేదు.దీంతో సోమవారం నాడు జరిగే ఎన్నికలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

అసలు వివాదమేమిటీ?
2014 లో ప్రొద్దుటూరు మున్సిఫల్ ఎన్నికల్లో టిడిపికి 22, వైసీపీకి 18 కౌన్సిలర్లు గెలిచారు.మొత్తం 40 కౌన్సిల్ స్థానాలున్నాయి.అయితే ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో వైసీపీ నుండి గెలిచిన 9 మంది కౌన్సిలర్లు కూడ టిడిపిలో చేరారు. దీంతో మున్సిఫల్ కౌన్సిల్ లో టిడిపి బలం 31కి పెరిగింది.అయితే టిడిపి కౌన్సిలర్ గురివిరెడ్డి తొలుత ఛైర్మెన్ పదవిని చేపట్టాలని, ఆ తర్వాత ఆనం రఘుమారెడ్డి ఈ పదవిని చేపట్టాలని ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం మేరకు గురివిరెడ్డి ఛైర్మెన్ పదవికి రాజీనామా చేశారు.దీంతో ఛైర్మెన్ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.అయితే వైసీపి నుండి టిడిపిలో చేరిన ముక్తియార్ నుండి మున్సిఫల్ చెర్మెన్ పదవిని ఆశిస్తుండడం వల్ల వివాదానికి కారణమైంది.

రఘుమారెడ్డి, ముక్తీయార్ వర్గాలు సై అంటే సై
ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ పదవి కోసం ముక్తియార్, రఘుమారెడ్డిలు పోటీకి సై అంటున్నారు.అయితే ఈ రెండు గ్రూపులు కూడ తమ బెట్టును వీడడం లేదు. ముక్తియార్ గ్రూపుకు వైసీపీ మద్దతివ్వడానికి సిద్దమని ప్రకటించడంతో ఆయన కూడ రంగంలో ఉంటున్నాడు.దీంతో క్యాంపుల నుండే నేరుగా ఎన్నికలు జరిగే సమావేశానికి చేరుకొన్నారు రెండు గ్రూపులు.రెండు రోజుల పాటు ఎన్నికల వాయిదాకు పథకం ప్రకారం ప్రచారం ప్లాన్ చేశారు.అయితే రెండు దఫాలు ఎన్నిక వాయిదా పడడంతో సోమవారంనాడు మరోసారి ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించనున్నారు.

రాజీఫార్మూలా ఇదే
గత నెల 15, 16 తేదిల్లో మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది.అయితే ఈ ఘటనపై చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. బాబు సీరియస్ కావడంతో పార్టీ నాయకత్వం గత నెల 19,20,21,22 తేదిల్లో ప్రొద్దుటూరు టీడిపి నేతలతోనూ, జిల్లా నేతలు, మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతోనూ పలుమార్లు సమావేశమై చర్చించారు.ఆనం రఘురామిరెడ్డి, విఎస్ ముక్తియార్ తోనూ చర్చించారు.ఆనం మున్సిఫల్ చైర్మెన్ ను చేసేలా, ఆ తర్వాత ముక్తియార్ కు నామినేటేడ్ పదవిని ఇచ్చేలా అధిష్టానం ఇద్దరి మద్య రాజీ కుదర్చించింది.

రెండు వేర్వేరు క్యాంపుల్లోనే కౌన్సిలర్లు
ఆనం రఘుమారెడ్డికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు, ముక్తియార్ కు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపుల్లోనే ఉన్నారు. ఆదివారం నాడు మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిలు సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నాడు నిర్వహించే ప్రొద్దుటూరు మున్సిఫల్ చెర్మెన్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. రెండు గ్రూపులు ఏకమౌతాయా లేదా అనేది ఇంకా ఉత్కంఠ నెలకొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications