త్రివిక్రమ్ వల్లే పవన్ కల్యాణ్ - రేణుదేశాయ్ విడిపోయారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా ఒక పేజీ ఉంటుంది. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా పవన్ పై త్రివిక్రమ్ ముద్ర బలంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించినవేనంటూ వార్తలు వస్తుంటాయి. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం వల్ల ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ దూరంగా ఉండాల్సి వస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ను పొగిడేందుకు బండ్ల గణేష్ పేరు అభిమానులు ముందుగా చెబుతారు. అంతేకాదు.. పవన్ సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లోను బండ్ల ఉండాలని కోరుకుంటారు. అయితే భీమ్లానాయక్ సినిమా ఈవెంట్ విషయంలోవివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈవెంట్లకు రాకుండా తనను త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని, కావాలనే తనను పిలవడంలేదంటూ త్రివిక్రమ్ పై మండిపడ్డ గణేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఆడియో తనది కాదని మొదట్లో బుకాయించినప్పటికీ అవి తనవేనని, త్రివిక్రమ్ ను తిట్టానని చెప్పాడు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయం పవన్ అభిమానులకు మరోసారి అర్థమైంది. అప్పుడప్పుడు గురూజీ అంటూ బండ్ల గణేష్ కౌంటర్లు వేస్తుంటాడు. తాజాగా ఓ నెటిజన్‌కు బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. నిర్మాత కావాలని ఉంది బండ్లన్న అని ఓ నెటిజన్ సలహా అడగ్గా.. గురూజీని కలువు.. కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వు అంటూ కౌంటర్లు వేశాడు.

ఆ తర్వాత మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం కాక రేపుతోంది. గురూజీకి కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి.. అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడంట కదా? అని అడిగాడు ఓ నెటిజన్. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం.. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడని, అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ కౌంటర్లు వేశాడు. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications