వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీపై నిర్మాతల ఫిర్యాదు, వెంటనే చంద్రబాబు ఆదేశాలు

త్వరలో అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) స్లాబుల్లో భాగంగా హిందీ సినిమాలపై 45 శాతం పన్నును 28 శాతానికి తగ్గించిన కేంద్రం,

|
Google Oneindia TeluguNews

విజయవాడ: త్వరలో అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) స్లాబుల్లో భాగంగా హిందీ సినిమాలపై 45 శాతం పన్నును 28 శాతానికి తగ్గించిన కేంద్రం, తెలుగు చిత్ర పరిశ్రమపై మాత్రం పన్నును రెట్టింపు చేశారని నిర్మాతల మండలి ఆరోపించింది.

అందరి గురించి తెలిసి: చివర్లో టర్న్ తీసుకున్నారా, దాసరి ఆరా?అందరి గురించి తెలిసి: చివర్లో టర్న్ తీసుకున్నారా, దాసరి ఆరా?

దీని వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని నిర్మాతల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాతల మండలి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

బాబును కలిసి ఫిర్యాదు

బాబును కలిసి ఫిర్యాదు

నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, సి కల్యాణ్, ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, జీఎస్టీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతమున్న 14 శాతం పన్నును 28 శాతానికి పెంచడం ద్వారా చిన్న చిత్రాల మనుగడ కుదేలవుతుందన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెండి

కేంద్రంపై ఒత్తిడి తెండి

పెంచిన పన్నును తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు చంద్రబాబును కోరారు. నిర్మాతల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వెంటనే లేఖను రాయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడును ఆదేశించారు.

ఉద్యోగులకు చంద్రబాబు ఆదేశాలు

ఉద్యోగులకు చంద్రబాబు ఆదేశాలు

మరోవైపు, ఈ వారాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. శని, ఆదివారాల్లో నవనిర్మాణ దీక్షలు చేపట్టనున్న కారణంగా ఈ రెండు రోజులూ పని చేసి, ఆ తరువాత ఆప్షనల్ హాలిడే తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను సీఎం కార్యాలయం విడుదల చేసింది.

ప్రజల్లోకి వెళ్లాలని..

ప్రజల్లోకి వెళ్లాలని..

సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రజల్లోకి వెళ్లాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. కలెక్టర్ల నుంచి అధికారుల వరకూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు.

English summary
Tollywood Producers meet AP CM Chandrababu Naidu on Thursday and complain on GST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X