ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం, 2019లో ఒక్క సీటు దక్కొద్దు: కంచ అయిలయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని బీజేపీ అమలు చేయకుండా మోసం చేసిందని ప్రొఫెసర్ కంచె అయిలయ్య విమర్శించారు.ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని నిలుపుకోకుండా మోసం చేసినబిజెపికి 2019లో ఎక్కడ సీట్లు రాకూడదని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీని బిజెపి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.

గత ఏడాది అక్టోబర్ మాసంలో విజయవాడకు రాకుండా ప్రభుత్వం తనను అడ్డుకొందని ఆయన చెప్పారు. దళిత, బహుజన మేథావులు రాజకీయ శక్తి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

professor kancha Ilaiah slams on Bjp leaders

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అదే సమయంలో సామాజిక న్యాయంపై కూడ పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. కార్పోరేట్ కంపెనీల్లో ఎస్పీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో టీ మాస్‌ను ఏర్పాటు చేసినట్టుగానే ఏపీ రాష్ట్రంలో కూడ ఏపీ మాస్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రోఫెసర్ కంచె అయిలయ్య కోరారు.
ఆర్యవైశ్యులను కించపరిచేలా పుస్తకం రాశారని గత ఏడాది కంచె అయిలయ్య రాసిన పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. అయిలయ్య విజయవాడ పర్యటనను కూడ అడ్డుకొన్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Professor kancha ilaiah made allegations on Bjp leaders over special status to Ap state.He spoke to media on Sunday at Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X