పిల్లల్ని చంపి నావద్దకి: సుహాసిని, శ్రీకాంత్‌ని కదిలించింది
హైదరాబాద్: తన ఇద్దరు పిల్లలను చంపి గురుప్రసాద్ తన వద్దకు వచ్చాడని సుహాసిని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక్‌ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన పిల్లలను చంపి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పిల్లల మృతదేహాలను సోమవారం గుర్తించారు.
మృతదేహాలకు మంగళవారం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం పూర్తయింది. ఇద్దరు పిల్లల పైన కత్తి పోట్లు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించినట్లుగా సమాచారం. పెద్ద కొడుకు మెడపై రెండు, చిన్న కొడుకు మెడపై మూడు కత్తిపోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టంను పోలీసులు వీడియో రికార్డ్ చేశారని తెలుస్తోంది.

పిల్లల మృతిని గురుప్రసాద్ భార్య, పిల్లల తల్లి సుహాసిని జీర్ణించుకోలేక పోతున్నారు. తన పిల్లలను గురుప్రసాద్ దారుణంగా చంపాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పారు. పిల్లల్ని చంపి తన వద్దకు వచ్చాడని తెలిపారు.
శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వచ్చి ఆలయానికి వెళ్తామని చెప్పాడని, పిల్లల గురించి అడిగితే ఏమీ చెప్పలేదని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు ఫోన్ చేసి గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పారని తెలిపారు. అయితే, తన పిల్లలు బతికే ఉంటారని ఆశపడ్డానని, కానీ అతను చంపేశాడని కన్నీరుమున్నీరయ్యారు.
హీరో శ్రీకాంత్‌ను కదిలించింది
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు కొడుకులను దారుణంగా చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న గురుప్రసాద్ ఉదంతంపై హీరో శ్రీకాంత్ స్పందించారు. సమస్యలకు భయపడి జీవితాన్ని పాడుచేసుకోరాదని హితవు పలికారు. ఓ టీవీ చానల్ చిట్‌చాట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ... ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. కన్నబిడ్డలను తండ్రే హత్య చేయడం దారుణమని, పెద్దల కోపతాపాలకు పిల్లలను బలిచేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications