వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ నిర్మాణాలపై కఠినమే: నారాయణ, బీజేపీ ఎంపీకి చిక్కులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, సమీపంలోని ఎలాంటి ఆక్రణలు ఉన్నా తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో అక్రమ లే అవుట్లను ఏ విధంగా తొలగించామో కరకట్టల ఆక్రమణ పైన అలాగే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరకట్టల ఆక్రమణను సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పరిధఇలో అక్రమ కట్టడాలు ఉంటే చర్యలు తప్పవన్నారు. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయో వారంలోగా వివరణ ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

 prominent persons have built guest houses on the flood banks of Krishna River

బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజుపై ఆరోపణలు

తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు గోకరాజు రంగరాజు అక్రమంగా కట్టడం కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో గోకరాజు అక్రమంగా కడితే చర్యలు ఉంటాయా అనే చర్చ సాగుతోంది.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా కొద్ది నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన గోకరాజు రంగరాజు నిర్మించిన కట్టడంలోనే విడిది చేశారు.

కాగా, పలువురు ప్రముఖులు అక్రమంగా కట్టడాలు కట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షెడ్ల పేరుతే పర్మిషన్ తీసుకొని శాశ్వత కట్టడాలు కడుతున్నారని అంటున్నారు. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ఇతర నిర్మాణాలపై నోటీసులు జారీ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టరు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.

English summary
Though the Krishna River Conservation Act does not allow any construction on the river bank, several prominent persons have built guest houses, multistoried buildings, residential houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X