తిరుమల: శ్రీవారి మెట్టు వద్ద బైబిల్ స్వాధీనం
చిత్తూరు: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారం ఇంకా కనిపిస్తోంది. ఇటీవలే ఓ పాస్టర్ అలిపిరి నుండి ఆలయం వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా, శ్రీవారి మెట్టు నడక దారి వద్ద ఓ భక్తుడి నుండి ఓ మత గ్రంథాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి అనే వ్యక్తి నుండి బైబిల్ స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల పరిధిలో అన్యమత ప్రచారం చేశారన్న కేసులో ముగ్గురు నిందితులు బుధవారం తిరుపతి న్యాయస్థానంలో లొంగిపోయారు. అన్యమత ప్రచారానికి సంబంధించి కృష్ణా జిల్లా, విశాన్నపేట మండలం రామ్ నగర్‌కు చెందిన సుధీర్, మనోహర్ డేవిడ్, ఇదే జిల్లా చట్రాయి రోడ్డుకి చెందిన చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ పైన తిరుమల రెండో ప్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.

సుధీర్‌ను పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. న్యాయస్థానానికి అప్పగించారు. అప్పటి నుండి సుధీర్ తిరుపతి ప్రత్యేక ఉపకారాగారంలో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు బుధవారం తిరుపతి రెండో మున్సీఫ్ న్యాయస్థాంలో లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, భద్రత సిబ్బంది వైఫల్యం వల్లే పాస్టర్ సుధీర్ ఆలయం దగ్గర అన్యమత ప్రచారం చేశారని ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అన్యమత ప్రచారం అరికట్టేందుకు పీఠాధిపతుల సూచనలు స్వీకరించాలని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హిందువులే పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications