అమరాతి పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం: బెజవాడ యువతుల అరెస్ట్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు గురువారంనాడు దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు విజయవాడకు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
కానిస్టేబుల్ ఆత్మహత్య
గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా సర్పంచ్‌పై దాడి

విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌పై దాడి జరిగింది. నీరు-చెట్టు కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్న అనంతరం గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలంటూ అధికారులను సర్పంచ్ కోరారు. దీనికి టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
సర్పంచ్ కల్పించుకుని అధికారులు వివరణ ఇవ్వాలి కానీ మీరెలా ఇస్తారంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన జన్మభూమి కమిటీ సభ్యులు సర్పంచ్‌పై దాడికి దిగారు. దీంతో సర్పంచ్ గాయపడ్డారు. దాడిపై ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఆరుగురు వైసీపీ సభ్యులపై, ఇద్దరు టీడీపీ వారిపై కేసులు నమోదయ్యాయి.
సెరికల్చర్ ఉద్యోగి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో సెరికల్చర్ ఉద్యోగి హిమగిరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు సెరికల్చర్ జేడీ శర్మ, ఏఎస్‌ఓ దీపక్ కారణమంటూ రాసిన సూసైడ్‌నోట్‌ను ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications