మెట్రో పొలిస్: జర్నలిస్టుల భయంతో..! ఆర్టిస్ట్స్ నిరసన

హైదరాబాద్: మెట్రో పొలిస్ ఇంటర్నేషనల్ సదస్సుకు హాజరయ్యే మీడియా ప్రతినిధులు కొందరు నిరసన వ్యక్తం చేయనున్నారనే సమాచారం రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియాను అనుమతించలేదనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులో 11వ మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, కొందరు జర్నలిస్టులు నిరసన తెలిపే అవకాశముందని తెలియడంతో ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన జర్నలిస్టులను సమావేశానికి దూరంగా ఉంచిందని చెబుతున్నారు.

మరోవైపు, తెలంగాణ చిత్రకారుల్లో నిపుణులైన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు నిరసన తెలిపారు. అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు నేపథ్యంలో వందేళ్ల తెలంగాణ చిత్రకళ చరిత్రను కాపీ టేబుల్ బుక్ పుస్తక రూపంలో రూపొందించి సదస్సు ద్వారా ప్రపంచానికి చూపేందుకు అధికారులు నిర్ణయించారు.

Protest threat has Telangana keep journalists away from 11th Metropolis Congress Week

అందుకోసం ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎట్ తెలంగాణ ట్రస్ట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అర్హులైన చిత్రకారులకు అన్యాయం చేశారని కొందరు విమర్శించారు. కాఫీ టేబుల్ బుక్‌లో అవకాశం లేకుండా చేశారని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం వివక్షల కాన్వాసు మీద ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరుతో చిత్రాలు గీసి తమ నిరసన తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిభ గల వారిని వెలుగులోకి తెస్తూనే మరికొందరిని ఉద్దేశ్య పూర్వకంగా చీకట్లోకి నెడుతున్నారని వారు ఆరోపించారు. పక్షపాత ధోరణి గల వారికి ఆర్ట్ కమ్యూనిటీ బాధ్యతల్ని అప్పగించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+