Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాబ్ క్యాలెండర్ పై నిరసనల వెల్లువ-తొలిసారి వైసీపీ సర్కార్ పై భారీ వ్యతిరేకత-రాష్ట్రవ్యాప్తంగా

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తాజాగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. అయితే నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకునే క్రమంలో తాజాగా సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇందులో నామమాత్రంగా ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. గతంలో ఎప్పుడో ప్రభుత్వంలో కలిపేసుకున్న ఆర్టీసీ ఉద్యోగుల్ని సైతం జాబ్ క్యాలెండర్ లో చూపడంతో నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఈ సెగ ఇవాళ రాష్ట్ర సచివాలయాన్ని తాకింది.

 జాబ్ లెస్ క్యాలెండర్

జాబ్ లెస్ క్యాలెండర్

ఏపీలో ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన ఉద్యోగాల హామీ అమల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అియితే ఇందులో నామమాత్రంగానే ఖాళీలు భర్తీ చేయనుండటంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర విభజనతో వారసత్వంగా వచ్చిన సమస్యల్ని సాకుగా చూపుతూ ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆగ్రహంగా ఉన్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ను జాబ్ లెస్ క్యాలెండర్ గా అభివర్ణిస్తూ నిరసనలకు దిగుతున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

వైసీపీ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాలు, విపక్ష పార్టీలు నిరసనలు చేపడుతున్నారు. అన్నిజిల్లాల్లోనూ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరనసగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి మరో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 సచివాలయాన్ని తాకిన జాబ్ క్యాలెండర్ సెగ

సచివాలయాన్ని తాకిన జాబ్ క్యాలెండర్ సెగ

వైసీపీ సర్కార్ జాబ్ క్యాలెండర్ పై కొన్నిరోజులుగా జిల్లా కేంద్రాల్లో, నగరాల్లో, పట్టణాల్లో నిరసనలు తెలుపుతున్న విద్యార్ధి సంఘాలు ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలియడంతో సచివాలయానికి మకాం మార్చారు. ఉదయం కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే సచివాలయం గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయం సమీపంలో నిరసనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కేబినెట్ సమావేశం వేళ నిరుద్యోగులు సీఎం కాన్వాయ్ తో పాటు మంత్రుల్ని కూడా అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

 జాబ్ క్యాలెండర్ పై నోరెత్తని వైసీపీ సర్కార్

జాబ్ క్యాలెండర్ పై నోరెత్తని వైసీపీ సర్కార్

సీఎం జగన్ అట్టహాసంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. విద్యార్ధి సంఘాలు ఇంత భారీ స్ధాయిలో రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లుగా ఉండిపోతోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఇంత భారీ స్ధాయిలో నిరసనలు చేపట్టలేదు. అయినా ప్రభుత్వం మాత్రం ఈసారి జాబ్ క్యాలెండర్ విషయంలో ఎదురవుతున్న నిరసనల్ని పట్టించుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+