చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chiru's Sister joined In TDP చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు ? | Oneindia Telugu

  అమరావతి: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళా విబాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి వ్యవహరించారు.

  బాబు, జగన్, హరీష్, నన్ను ఎవరూ ఓడించలేరు: టిడిపికి కొడాలి నాని కౌంటర్

  సొంతగూటికి శోభారాణి

  సొంతగూటికి శోభారాణి

  ఇప్పుడు ఆ శోభారాణి తిరిగి సొంతగూడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో ఆమె పచ్చ కండువా కప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు టిడిపి నుంచి ఆ పార్టీలోకి చేరిన శోభారాణి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

  అందుకే టిడిపిలోకి

  అందుకే టిడిపిలోకి


  తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం శోభారాణి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఆకర్షించాయని చెప్పారు. అందువల్లే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.

  చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు

  చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు

  టిడిపిలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని శోభారాణి అన్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాక ఏమి చేయాలో అర్థంకాక కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లోటు బడ్జెట్‌లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

  కలిసి పని చేయాలని మంత్రి

  కలిసి పని చేయాలని మంత్రి

  మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. శోభారాణి ప్రజారాజ్యంలో చేరక ముందు టిడిపిలోనే కార్యకర్తగా, నాయకురాలిగా సేవలందించారని గుర్తు చేశారు. మహిళా నాయకురాళ్ళు అందరితో కలసికట్టుగా పని చేస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

  ప్రజారాజ్యం పార్టీకి లౌడ్ మౌత్ లీడర్‌గా..

  ప్రజారాజ్యం పార్టీకి లౌడ్ మౌత్ లీడర్‌గా..

  కాగా, చిరంజీవి ప్రజారాజ్యంలో శోభారాణి పార్టీకి లౌడ్ మౌత్ లీడర్‌గా ఉన్నారు. అప్పుడు ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన కొన్నాళ్లకు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆమె పేరు వినిపించలేదు.

  నాడు రోజాతో ఢీ

  నాడు రోజాతో ఢీ

  ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే రోజా గతంలో టిడిపిలో ఉన్నారు. అప్పుడు శోభారాణి ప్రజారాజ్యం పార్టీ తరఫున, రోజా టిడిపి తరఫున మాటల యుద్ధం జరిపేవారు. ఇప్పుడు అదే శోభారాణి టిడిపిలో చేరారు. రోజా ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్నారు.

  చిరంజీవిపై నిప్పులు

  చిరంజీవిపై నిప్పులు

  2009లో చిరంజీవి ఆమెకు పార్టీ టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆమె పీఆర్పీ నుంచి బయటకు వచ్చి.. చిరంజీవిపై మాటల దాడి చేశారు. పీఆర్పీ ఫ్లాఫ్ షో అని నిప్పులు చెరిగారు. చిరంజీవి పార్టీని సరైన దిశలో నడిపి, ప్రజల కోసం పోరాడాలని చురకలు అంటించేవారు.

  చిరంజీవి పార్టీని అమ్మేశారని..

  చిరంజీవి పార్టీని అమ్మేశారని..


  అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పార్టీని అమ్మేశాడని శోభారాణి ఆరోపించారు. మెగా కుటుంబ సభ్యుల చిత్రాలు బ్యాన్ చేయాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On Thursday, Shobha joined Telugu Desam Party in the presence of minister Nakka Anand Babu, claiming that she was attracted by the developmental programmes being taken up by the Chandrababu Naidu government.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి