సిఎం గారూ మీరైనా క్లారిటీ ఇవ్వండి: "పెళ్లికానుక" ఎవరికోసం...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎపిలో ప్రజాప్రతినిధులకు ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి విచిత్రమైన సమస్య ఎదురవుతోందంట...అందుకే ఆ విషయమై నేరుగా సిఎం చంద్రబాబునే క్లారిటీ ఇవ్వమని ఓ నేత అడిగేశాడు... అనూహ్యంగా ఎదురైన ఆ ప్రశ్నను బట్టి పరిస్థితి అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి పరిష్కారం కనుగొనాల్సిందిగా సీనియర్లను ఆదేశించారు...

ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థిక సాయం అందించే కొత్త పథకం అమలవుతోంది. బిసి కులాల్లో నిరుపేదల కుటుంబాలకు వివాహ సమయంలో ఆదరువుగా ఉండేందుకు ఈ చంద్రన్న పెళ్లికానుక పథకం ప్రవేశపెట్టారు.

పెళ్లి సమయంలో వధూవరుల జంటకు రూ.30 వేలు అందజేయటమే ఈ "పెళ్లికానుక" పథకం. అయితే ఇప్పుడు ఈ పథకం అమలు లోనే ఊహించని సమస్య ఎదురవుతోందట. ఆ 30 వేలు మాకు చెందుతాయంటే మాకే చెందుతాయని వధూవరుల కుటుంబాలు గొడవలు పడుతున్నాయట.

నూతన పథకం అమలు...సమస్య...

నూతన పథకం అమలు...సమస్య...

పెళ్లి సమయంలో పేదింటి ముస్లిం మహిళలకు ‘దుల్హన్' కాగా, అలాగే బిసి వధూవరుల కోసం ప్రవేశపెట్టిన నూతన పథకం చంద్రన్న పెళ్లికానుక. ఈ పథకం ప్రకారం నిరుపేదలైన బిసి వధూవరులకు పెళ్లి సమయంలో 30 వేల రూపాయలను ప్రభుత్వం అందచేస్తుంది. అయితే బిసీల్లో తెల్లకార్డు ఉన్నవారికి, దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ పథకం అమలు లోనే ఊహించని సమస్య ఎదురవుతోందట.

  ఫ్యూచర్-రిలయెన్స్‌తో జట్టు అందుకే ! విలేజ్ మాల్స్‌ నో యూజ్ ? | Oneindia Telugu
  పెళ్లికానుక...సమస్య ఏమిటంటే...

  పెళ్లికానుక...సమస్య ఏమిటంటే...

  అయితే ఇప్పుడు ఈ పెళ్లికానుక పథకం అమలు లో ఊహించని సమస్య ఎదురవుతోందట. ప్రభుత్వం ఇస్తున్న ఈ "పెళ్లికానుక" కోసం వధూవరుల కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఈ "పెళ్లికానుక" మాకే చెందుతుందంటే మాకే చెందుతుందని పెళ్లి కొడుకు-పెళ్లికూతురు తల్లిదండ్రులు ఘర్షణలు పడే పరిస్థితి వస్తోందట.

  అందుకే సిఎంనే...క్లారిటీ...

  అందుకే సిఎంనే...క్లారిటీ...

  ఈ చంద్రన్న పెళ్లికానుక ఎవరికి చెందుతుందనే విషయమై మీరే తేల్చండంటూ ప్రజాప్రతినిధుల వద్ద పంచాయితీ పెడుతున్నారట. దీంతో ఎటూ చెప్పలేక మేము సతమతమైపోతున్నామని ఓ ప్రజాప్రతినిధి నేరుగా సిఎంనే క్లారిటీ కోసం అడిగేశాడు. అలా అడిగింది మరెవరో కాదు...బాపట్ల ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్...చంద్రన్న పెళ్లికానుక ఎవరికి చెందుతుందో చంద్రబాబు గారే చెప్పాలంటూ టెలీ కాన్ఫరెన్స్ లోనే నేరుగా సిఎంని అడిగేశారు. పెళ్లి ఖర్చుల కింద ఇస్తున్నారు కాబట్టి తమకే చెందుతుందని అమ్మాయి తరపు వారు, అమ్మాయి కోసమే ఇస్తున్నారు కాబట్టి మాకు చెందుతుందని అబ్బాయి తరపు వారు తగువులు పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

  సిఎం...సీనియర్లకు పురమాయింపు...

  సిఎం...సీనియర్లకు పురమాయింపు...

  చంద్రన్న పెళ్లికానుకపై అనూహ్యంగా ఎదురైన ఈ ప్రశ్నకు సిఎం వెంటనే ఏం చెప్పాలో తెలియక సీనయర్లను ఈ సమస్యపై అధ్యయనం చెయ్యాల్సిందిగా ఆదేశించారట. ఈ విషయమై సీనియర్లు కూర్చుని చర్చించి పెళ్లికానుక ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Public representatives are seeking clarity on Chandranna Pelli kanuka in Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X