40 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టబోతోందెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ నియోజకవర్గంలో గెలుపు మాత్రం వారి ఖాతాలో పడాల్సిందే. అంతగా ఆ కుటుంబానికి అది కంచుకోటగా మారింది. రేపో మాపో ఏపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తమ కుటుంబానికి తొలినుంచి కంచుకోటగా ఉంటున్న ఈ నియోజకవర్గాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆ కుటుంబం ఏదంటే.. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాగా.. నియోజకవర్గం పేరు పులివెందుల.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరిగిన 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1962లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత 1962 నుంచి 2009 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత వీచిన ఎన్టీఆర్ గాలిని కూడా తట్టుకొని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది.

pulivendula assembly constituency details

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2010, 2011లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దివంగత వైఎస్ సతీమణి విజయమ్మ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. మరోసారి అక్కడి నుంచి పోటీచేసేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని, బీజేపీ, జనసేనను కలుపుకొని వెళితే పులివెందులలో కూడా టీడీపీ జెండాను ఎగిరేలా చేయవచ్చని పార్టీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంపై గెలుపు సాధించడం అంత సులువేం కాదని ఆయనకు కూడా తెలుసు. ఆయన అనుకున్నట్లుగా విజయం సాధిస్తారా? లేదంటే మెజారిటీని తగ్గించగలుగుతారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన తర్వాతే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+