వివేకా హత్య కేసు - వెలుగులోకి సంచలనాలు : సీఐ శంకరయ్య వాంగ్మూలంతో..!!
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణ సమయంలో పలువురు కీలక వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు బయటకు తెలుస్తున్నాయి. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో హత్య సమాచారం తనకు ఎవరి దగ్గరి నుంచి వచ్చిందనేది మొదలు... అక్కడ ఏం జరిగింది...ఆ సమయంలో ఎవరెవరున్నారనే అంశం పైన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
Recommended Video

వారికి మొత్తం తెలుసంటూ
ఇదే సమయంలో తాను 302 సెక్షన్ ఎందుకు కేసు నమోదు చేయలేకపోయిందనేది వివరించినట్లుగా కధనాలు వస్తున్నాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న భయంతోనే తొలుత హత్యానేరం (ఐపీసీ సెక్షన్ 302) కింద కేసు నమోదు చేయలేకపోయానని వివరించారు. కేసు లేకుండానే... వివేకా మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వారు ప్రయత్నించారని చెప్పారు. ఎవరు హత్య చేశారో వారికి తెలుసని సీఐ పేర్కొన్నట్లుగా సీబీఐ తన ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. ఎంపీ అవినాశ్ రెడ్డి కార్యలయాన్ని శివ శంకర్ రెడ్డి నిర్వహిస్తారని..ఆయనతో పాటుగా అన్నింటా ఉంటారని సీఐ చెప్పినట్లుగా సీబీఐ పేర్కొంది. తాను ఘటనాస్థలానికి వెళ్లేసరికి శివశంకర్‌రెడ్డి అక్కడే ఉన్నారు.

అందుకే నియంత్రించలేకపోయా
అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించేందుకు వీలుగా ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఫ్రీజర్‌ను వివేకా ఇంట్లోకి తెప్పించారు. మృతదేహాన్ని అందులోకి తరలించకుండా అడ్డుకున్నాను. వీరిద్దరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా కనిపించింది' అని శంకరయ్య వాంగ్మూలంలో వివరించారు. ఘటనా స్థలం వద్ద భారీగా జనసమూహం ఉండటంతో వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు బ్యాండేజీలు, కట్లు కడుతున్నవారిని నియంత్రించలేకపోయానని శంకరయ్య ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ వేకువజామున గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా ఇంటి సమీపంలో తిరుగుతున్నట్ల దర్యాప్తులో గుర్తించామని గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన ఆర్. వాసుదేవన్ సీబీఐకి తెలిపారు.

సీఐ వాంగ్మూలంగా కీలకం కానుందా
ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే అంశంపై ఉదయ్‌కుమార్‌రెడ్డిని రెండు, మూడు సార్లు ప్రశ్నించగా.... ఒక్కోసారి ఒక్కోలా మాట మార్చి సమాధానాలిచ్చారని ఆయన వివరించారు. ఇదే సమయంలో మాజీమంత్రి వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో కడవ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులోని ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులన్నీ హైకోర్టుకు సమర్పించాలని మెజిస్ట్రేటు ఆదేశించింది. కేసు దర్యాప్తు అడ్డుకునేందుకే ఉదయ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రామ్‌సింగ్ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.












Click it and Unblock the Notifications