వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఓట్లపై పురంధేశ్వరి షాకింగ్: పవన్ కళ్యాణ్‌కు ప్రశంస, బాబుతో పొత్తుపై

బిజెపి మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మంగళవారం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో గతంలో కంటే బిజెపికి ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మంగళవారం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో గతంలో కంటే బిజెపికి ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు.

చంద్రబాబుతో పొత్తుపై

చంద్రబాబుతో పొత్తుపై

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి పొత్తు వ్యవహారం గురించి ప్రశ్నించగా.. పొత్తు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదని, రెండు పార్టీల మధ్య జరిగేదని పురంధేశ్వరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తుపై తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Recommended Video

Purandeswari Shocks Chandrababu, AP Development Credit Goes To Central Government
వెంకయ్య నాయుడు లేకపోవడం లోటు

వెంకయ్య నాయుడు లేకపోవడం లోటు

వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ.. క్రియాశీలక రాజకీయాల గురించి ఆయన తప్పుకోవడం ఏపీలో బీజేపీకి కొంత నష్టమేనని భావిస్తున్నానని చెప్పారు.

కానీ, గర్వకారణం

కానీ, గర్వకారణం

వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని పురంధేశ్వరి అన్నారు. వెంకయ్యను ఉద్దేశ్యపూర్వకంగా క్రియాశాలక రాజకీయాల నుంచి తప్పించారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ గ్రేట్, ముద్రగడకు అనుమతివ్వాల్సింది

పవన్ కళ్యాణ్ గ్రేట్, ముద్రగడకు అనుమతివ్వాల్సింది

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చొరవ అభినందనీయమని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి నిరాకరించడం సబబుకాదని, వ్యక్తి స్వేచ్ఛ, హక్కులను హరించడం సరికాదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.

సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్

English summary
Former Union Minister and BJP leader Purandeswari interesting comments on BJP vote share in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X